- ఐసిఈ-పవర్డ్ కర్వ్ మరియు కర్వ్ ఈవీలను ఒకేసారి లాంచ్ చేయనున్న కార్ మేకర్
- సిట్రోన్ బసాల్ట్ కూపే-ఎస్‌యువి వంటి వాటికి పోటీగా ఉండనున్న మోడల్
టాటా మోటార్స్ కర్వ్ ఐసీఈ మరియు ఈవీ వెర్షన్లకు సంబంధించి మరొక టీజర్ వీడియోను లాంచ్‌కు ముందుగా విడుదల చేసింది, ఇది మరికొన్ని వారాల్లో లాంచ్ కానుంది. అలాగే, కొత్త టీజర్ వీడియోలో అన్ని పవర్‌ట్రెయిన్ ఆప్షన్ల లో సాధారణంగా ఉండే కీలక ఫీచర్లను వెల్లడించింది.
టీజర్ లో చూసిన ఫోటోల ప్రకారం, కొత్త కర్వ్ ఈవీమరియు ఐసిఈ ఇటరేషన్స్ స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్‌ను పొందుతాయి, మెయిన్ హెడ్‌లైట్ క్లస్టర్ కొత్త నెక్సాన్ మరియు పంచ్ ఈవీల మాదిరిగానే ఉంటుంది. నిజానికి చెప్పాలంటే, ఎల్ఈడీ డిఆర్ఎల్ఎస్ డిజైన్ కూడా పైన పేర్కొన్న నెక్సాన్ మరియు పంచ్ ఈవీ మోడల్స్ లాగే ఉంటుంది.
మరోవైపు, 2024 టాటా కర్వ్ 16- లేదా 17-ఇంచ్ కొత్త అల్లాయ్ వీల్స్ మరియు టూ-పీస్ ర్యాప్‌రౌండ్ ఎల్ఈడీ టెయిల్‌లైట్స్ సెట్ తో రానుంది. అలాగే ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్ మరియు షార్క్-ఫిన్ యాంటెన్నా కూడా ఇందులో అందించబడనున్నాయి .
కర్వ్ హుడ్ కింద, ఐసిఈ రూపంలో, 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌లను పొందుతుంది. ఈవీ డెరివేటివ్ టెక్నికల్ స్పెసిఫికేషన్స్ వివరాలను కార్‌మేకర్ ఇంకా వెల్లడించలేదు. అలాగే, కర్వ్ దాని అప్ కమింగ్ (రాబోయే) ఏకైక కూపే-ఎస్‌యువికి పోటీగా ఉన్న సిట్రోన్ బసాల్ట్ తో మాత్రమే కాకుండా, ట్రెడిషనల్ మిడ్-సైజ్ ఎస్‌యువిలు అయిన మారుతి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, స్కోడా కుషాక్ మరియు ఫోక్స్‌వ్యాగన్ టైగున్ వంటి కార్లకు పోటీగా ఉండనుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప