- 2024 ఆగస్టు 7న ఇండియాలో లాంచ్
- బిఎన్ క్యాప్ టెస్టులో 5-స్టార్ రేటింగ్ పొందిన ఆరవ టాటా కారు
టాటా మోటార్స్ దాని కర్వ్ కూపే ఎస్‍యూవీ బిఎన్ క్యాప్ క్రాష్ టెస్టులో 5-స్టార్ రేటింగ్ పొందడం ద్వారా మరో మైల్ స్టోన్ ని సాధించింది. ఈ కారు అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్లో 32 పాయింట్లకు గాను 29.50 పాయింట్లు స్కోర్ చేయగా, చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్లో 49 పాయింట్లకు గాను 43.66 పాయింట్లు స్కోర్ చేసింది. ఇక్కడ టెస్టింగ్ చేయబడిన పవర్ ట్రెయిన్లలో డీజిల్ ఎంటి, పెట్రోల్ డిసిటి, మరియు పెట్రోల్ ఎంటి వంటి పవర్ ట్రెయిన్లు ఉన్నాయి.
అక్కడ నిర్వహించిన టెస్టులలో, డ్రైవర్ సైడ్ చూస్తే ఈ కారు హెడ్ నెక్ (మెడ) మంచి స్కోరు సాధించగా, లోయర్ బాడీ వైపు ఉన్న కుడి తొడ పర్వాలేదనిపించగా, ఎడమ తొడ భాగం వైపు మార్జినల్ స్కోర్ సాధించింది. ఇంకా ఫ్రంట్ ప్యాసింజర్ పరంగా చూస్తే, హెడ్ నెక్ (మెడ) మంచి స్కోరు సాధించగా, లోయర్ బాడీ వైపు ఉన్న కుడి, ఎడమ తొడల భాగం పర్వాలేదనే స్కోరు సాధించింది. ఫ్రంటల్ ఆఫ్ సెట్ డీఫార్మబుల్ టెస్టులో 16 పాయింట్లకు గాను 14.65 పాయింట్లు స్కోర్ చేసింది, మరియు సైడ్ మూవబుల్ డీఫార్మబుల్ బ్యారియర్ టెస్టులో 16 పాయింట్లకు గాను 14.85 పాయింట్లు స్కోర్ చేసింది. చైల్డ్ ఆక్యుపెంట్స్ పరంగా, సీఆర్ఎస్ స్కోరు 12/12 ఉండగా, వెహికిల్ అసెస్ మెంట్ ద్వారా 9/13 స్కోరు లభించింది.
సేఫ్టీ ప్యాకేజీలో భాగంగా, టాటా కర్వ్ లోని అన్నీ వెర్షన్లు స్టాండర్డ్ గా 6 ఎయిర్ బ్యాగ్స్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంటింగ్ పాయింట్స్, ఈఎస్‍సీ, సీట్ బెల్ట్ రిమైండర్ మరియు పెడెస్ట్రియన్ ప్రొటెక్షన్ వంటి ఫీచర్లను పొందాయి. టాటా కర్వ్ కారు 2024 ఆగస్టు 7వ తేదీన ఇండియాలో లాంచ్ కాగా, ఈ కారు హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి విటారా, మరియు టయోటా హైరైడర్ వంటి కార్లతో పోటీపడుతుంది. టాటా కర్వ్ కారును పెట్రోల్, డీజిల్ మరియు అలాగే ఈవీ వెర్షన్లో కూడా పొందవచ్చు.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్