- 2025 ద్వితీయార్థంలో లాంచ్ అయ్యే అవకాశం
- ప్రొడక్షన్-రెడీ రూపంలో టెస్టింగ్ కొనసాగిస్తూ కనిపించిన మోడల్
మహీంద్రా వచ్చే సంవత్సరం ఎలక్ట్రిక్-పవర్డ్ ఎస్‌యువి రేంజ్ ని లాంచ్ చేయనుంది.ఆటోమేకర్ ఇప్పటికే దాని భవిష్యత్ ఎలక్ట్రిక్ వెహికల్స్ లో వివిధ ప్రోటోటైప్స్ మరియు కాన్సెప్ట్స్ లను ప్రదర్శించింది. లాంచ్ కానున్న అనేక ఈవీలలో, మొట్టమొదటిసారిగా మేము ఇటీవల గుర్తించినది BE.05 కూపే, ఇది టాటా కర్వ్ ఈవీకి పోటీగా ఉండనుంది.
కూపే అయినందున, BE.05 తక్కువ-స్లంగ్ ఇంటిగ్రేటెడ్ రియర్ స్పాయిలర్‌తో పాటు రేక్డ్ రియర్ విండ్ స్క్రీన్‌తో సిగ్నేచర్ స్లోపింగ్ రూఫ్‌లైన్‌ను పొందుతుంది. దీని కొలతల గురించి చెప్పాలంటే, BE.05 4,370ఎంఎం పొడవు, 1,900ఎంఎం వెడల్పు మరియు 1,653ఎంఎం ఎత్తు ఉంటుంది. అలాగే, ఎలక్ట్రిక్ క్రాస్ఓవర్ 2,775ఎంఎం వీల్‌బేస్‌ను కలిగి ఉంది.ఈ రకమైన నిష్పత్తులతో, BE.05 XUV400 కంటే ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఇండియన్ ఎస్‌యువి మేకర్ నుండి అందించబడుతున్న ఏకైక ఎలక్ట్రిక్ వెహికిల్ ఇదే.
ఇతర డిజైన్ హైలైట్‌ల విషయానికొస్తే, BE.05వైడ్ ఫేస్, హౌసింగ్ సి-షేప్డ్ ఎల్ఈడీడిఆర్ఎల్ఎస్, స్ప్లిట్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, పెద్ద ఎయిర్ డ్యామ్స్ మరియు బంపర్-మౌంటెడ్ ఫాగ్ ల్యాంప్‌లను కలిగి ఉంటుంది. అంతేకాకుండా, వీల్ ఆర్చ్‌లు వీల్స్ కి తగిన సైజులో స్క్వేర్ చేయబడి ఉంటాయి. ఇంకా, ఇది ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, ఏ-పిల్లర్ మౌంటెడ్ ఒఆర్‍విఎంఎస్, కనెక్ట్ చేయబడిన ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్స్ మరియు క్రాస్‌ఓవర్ స్పోర్టీ లుక్‌ను మెరుగుపరిచే స్ప్లిట్ స్పాయిలర్‌లను కలిగి ఉంటుంది.
BE.05 60kWh బ్యాటరీ ప్యాక్ తో వచ్చే అవకాశం ఉంది, ఇది ఫ్రంట్ యాక్సిల్-మౌంటెడ్ మోటార్‌లకు పవర్ ని సప్లై చేస్తుంది. ఇది మెరుగైన పెర్ఫార్మెన్స్ ని అందించడానికి డ్యూయల్-మోటార్ వెర్షన్‌ను కూడా పొందుతుందని మేము ఆశిస్తున్నాము. అయితే, ప్రస్తుతానికి మా వద్ద దీనికి సంబంధించిన ఖచ్చితమైన స్పెసిఫికేషన్‌లు అందుబాటులో లేవు.
అనువాదించిన వారు: రాజపుష్ప