- ఐసీఈ మరియు ఈవీ పవర్ ట్రెయిన్లతో రానున్న కర్వ్
- సిట్రోన్ బసాల్ట్ వంటి కార్లతో పోటీ
టాటా మోటార్స్ ఇండియా అంతటా ఎంతగానో ఎదురుచూస్తున్న కర్వ్ మోడల్ కి సంబంధించి ఫ్రెష్ టీజర్ ని రిలీజ్ చేసింది. ఈ కొత్త టీజర్లో అప్ కమింగ్ కూపే-ఎస్‍యూవీ కొత్త వివరాలు మరియు ఇందులో అందించే ఫీచర్లు వెల్లడయ్యాయి. ఇది వరకు మేము తెలిపిన వివరాల ప్రకారం, కార్ మేకర్ కర్వ్ మోడల్ ని త్వరలోనే ఐసీఈ మరియు ఈవీ వెర్షన్లలో లాంచ్ చేయనుంది.
కొత్త టీజర్ ద్వారా 2024 కర్వ్ ఐసీఈ మరియు ఈవీ వెర్షన్ కార్లను వివిధ వాతావరణ పరిస్థితుల్లో మరియు ఆఫ్-రోడ్ కండిషన్లలో టెస్టింగ్ చేస్తునట్లు వెల్లడైంది. ముఖ్యంగా, ఐసీఈ వెర్షన్ మరియు ఈవీ వెర్షన్ కార్లను ముందు భాగంలో కనిపించే ఫాసియాను బట్టి గుర్తించవచ్చు.
ఇందులో అందించే ఫీచర్ల విషయానికి వస్తే, కర్వ్ ఐసీఈ మరియు ఈవీ వెర్షన్ కార్లు ఫుల్లీ డిజిటల్, కలర్డ్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ ని పొందనున్నాయి. కర్వ్ ఈవీ వెర్షన్ కారులో లేన్ కీప్ అసిస్ట్ ఫీచర్ ని ఉన్నట్లు వెల్లడవ్వగా, దీంతో ఈ కారులో ఎడాస్ సూట్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. అలాగే ప్యాడిల్ షిఫ్టర్స్ అందించబడనుండగా, ఇవి కర్వ్ ఐసీఈ వెర్షన్ కారులో గేర్లు షిఫ్ట్ చేయడానికి ఉపయోగపడతాయి. అదే విధంగా కర్వ్ ఈవీ వెర్షన్ కారులో ఇది రీజెన్ లెవెల్ గా మారుతుంది.
కొత్త టాటా కర్వ్ మోడల్ డ్రైవ్ మోడ్స్ ని కూడా పొందనుండగా, ఇవి సెంటర్ కన్సోల్ పై ఉన్న రోటరీ డయల్ సహాయంతో కారును వివిధ డ్రైవ్ మోడ్స్ కి స్విచ్ చేయడానికి వీలుగా ఉంటాయి. కర్వ్ ఐసీఈ లైనప్ లో మాత్రమే ఈకో, సిటీ, మరియు స్పోర్ట్ అనే మూడు డ్రైవ్ మోడ్స్ అందించబడనున్నాయి. టీజర్ ని మరింత నిశితంగా పరిశీలిస్తే, టూ-స్పోక్ మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్ సెంటరులో ఇల్యూమినేటెడ్ టాటా లోగోతో ఈ కారు ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఇంతకు ముందు రిలీజ్ అయిన టీజర్ల ద్వారా సిట్రోన్ బసాల్ట్ కారుతో పోటీపడుతున్న ఈ కారుకి సంబంధించిన కీలక ఎక్స్‌టీరియర్ ఫీచర్ల వివరాలను మీకు అందించాము. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్