- కర్వ్ కారులో ప్రత్యేకంగా హైపీరియన్ అనే కొత్త టిజిడిఐ ఇంజిన్ ని తీసుకువచ్చిన టాటా
- ఎనిమిది వేరియంట్లు మరియు ఆరు కలర్లలో కర్వ్ ఐసీఈ వెర్షన్ కారు లభ్యం
నెల క్రితం టాటా మోటార్స్ కర్వ్ ఎలక్ట్రిక్ కారును ఇండియాలో ఎక్స్-షోరూం ధరలు రూ.17.49 లక్షలతో లాంచ్ చేసింది. ఇప్పుడు ఇండియా ఎంతగానో ఎదురుచూస్తున్న ఐసీఈ వెర్షన్ ధరలను ప్రకటించింది. కర్వ్ ఐసీఈ వెర్షన్ కారు ఎక్స్-షోరూం ధరలను రూ.9.99 లక్షలతో ప్రారంభిస్తున్నట్లు టాటా మోటార్స్ పేర్కొంది. అంటే, ఇప్పుడు టాటా కర్వ్ కారు ఎలక్ట్రిక్ వెర్షన్ మరియు ఐసీఈ వెర్షన్ రెండింట్లో అందుబాటులోకి వచ్చింది.
ముందుగా కర్వ్ కారు డిజైన్ గురించి చెప్పాలంటే, టాటా మోటార్స్ దీనిపై మరింత ఎక్కువగా ఫోకస్ చేసింది. చూడడానికి ఆకట్టుకునే డిజైన్ ని ఇందులో అందించింది. ఇలాంటి డిజైన్ ని ఏ ఇతర టాటా కారులో కూడా చూసి ఉండరు. టాటా కర్వ్ కారు డిజైన్ హైలైట్లలో స్ప్లిట్ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్, ఎల్ఈడీ హెడ్‌లైట్స్, ఫ్రంట్ మరియు రియర్ ఎల్ఈడీలైట్ బార్స్, ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, ఎల్ఈడీ టెయిల్‌లైట్లు మరియు స్లోపింగ్ రూఫ్‌లైన్ వంటి ఫీచర్లను పొందింది.
కర్వ్ ఐసీఈ వెర్షన్ కారును కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు ఆరు కలర్లు మరియు ఎనిమిది వేరియంట్ల నుండి దీనిని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంటీరియర్ పరంగా, కర్వ్ కారు పనోరమిక్ సన్‌రూఫ్, 12.3-ఇంచ్ టచ్‌స్క్రీన్ సిస్టమ్, ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, రియర్ ఏసీవెంట్స్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, పవర్డ్ టెయిల్‌గేట్, ఆటో-హోల్డ్ ఫంక్షన్‌తో కూడిన ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, లెవెల్-2 ఎడాస్ (ఏడీఏఎస్)సూట్, వైర్‌లెస్ ఛార్జర్ మరియు మరెన్నో ఫీచర్లతో వచ్చింది.
టాటా కర్వ్ కారులో 1.2-లీటర్ టర్బో-పెట్రోల్, కొత్త 1.2-లీటర్ జిడిఐ టర్బో-పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్లను టాటా అందుబాటులోకి వచ్చింది. ముఖ్యమైన విషయం ఏంటి అంటే, కర్వ్ కారులో ప్రత్యేకంగా హైపీరియన్ అనే కొత్త టిజిడిఐ ఇంజిన్ ని అందించింది. ఈ ఇంజిన్ 123bhp మరియు 225Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో 6-స్పీడ్ మాన్యువల్ మరియు 7-స్పీడ్ డిసిటి యూనిట్ వంటివి ఉన్నాయి. కస్టమర్లు ఎనిమిది వేరియంట్ల నుండి కర్వ్ కారును సెలెక్ట్ చేసుకోవచ్చు. అందులో స్మార్ట్, ప్యూర్+, ప్యూర్+ ఎస్, క్రియేటివ్, క్రియేటివ్ ఎస్, క్రియేటివ్+ ఎస్, అకాంప్లిష్డ్ S, మరియు అకాంప్లిష్డ్+ ఎ వంటి వేరియంట్లు ఉన్నాయి.
టాటా కర్వ్ బేస్ మోడల్ | ఎక్స్-షోరూం ప్రారంభ ధర |
టాటా కర్వ్ టర్బో పెట్రోల్ | రూ.9.99 లక్షలు |
టాటా కర్వ్ డీజిల్ | రూ.11.50 లక్షలు |
టాటా కర్వ్ హైపీరియన్ జిడిఐ టర్బో పెట్రోల్ | రూ.13.99 లక్షలు |