- ఈవీ మరియు ఐసీఈ వెర్షన్లలో ఒకే రకమైన డ్యాష్ బోర్డు లేఅవుట్ తో వస్తున్న కర్వ్ మోడల్
- హారియర్ మరియు సఫారి ఎస్యువిల నుంచి తీసుకోబడనున్న ఫీచర్లు
టాటా మోటార్స్ అప్ కమింగ్ (రాబోయే) కర్వ్ కూపే ఎస్యువి కి సంబంధించిన మరికొన్ని స్కెచ్ డిజైన్లను రిలీజ్ చేసింది. అలాగే ఈసారి, డిజైన్ స్కెచ్స్ ఇంటీరియర్‌లో ఉన్న డ్యాష్‌బోర్డ్ లేఅవుట్ మరియు అన్ని ఫీచర్లను కలిగి ఉన్న కర్వ్ ఎస్యువి ఇండియన్ మార్కెట్లో అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉంది.
డిజైన్ స్కెచ్ వివరాలు చూసినట్లయితే , లోపలి భాగంలో కర్వ్ చాలా వరకు టాటా సఫారి మరియు హారియర్ ఎస్‌యువిలను పోలి ఉంటుంది. ఇది సెంట్రల్ ఏసీ వెంట్స్ పైన అమర్చిన పెద్ద 12.3-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, టచ్ ఆధారిత హెచ్ విఎసి ప్యానెల్ మరియు ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్‌తో కూడిన గేర్ సెలెక్టర్ లివర్‌ను కలిగి ఉంటుంది. ఇప్పుడు, పేర్కొన్న ఇవన్నీ వివరాలు సరిగ్గా సఫారి ఎస్‌యువిలో ఉన్న ఫీచర్లకు సమానంగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే, ఇది నెక్సాన్ ఎస్యువి నుండి ఇల్యూమినేటెడ్ లోగో మరియు డిజిటల్ డ్రైవర్ డిస్ప్లేతో కూడిన టూ-స్పోక్ స్టీరింగ్ వీల్‌ను పొందుతుంది.
ఫీచర్ల విషయానికి వస్తే, కర్వ్ వైర్లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, వైర్లెస్ ఛార్జర్, 360-డిగ్రీ సరౌండ్ కెమెరా, మూడ్ లైటింగ్‌తో కూడిన పనోరమిక్ సన్‌రూఫ్ మరియు లెవెల్ 2 ఏడీఏఎస్(ఎడాస్) సూట్‌తో సహా మరిన్ని ఫీచర్లను మీకు అందిస్తుంది.
ఇప్పుడు, కర్వ్ ఈవీ వెర్షన్ ఆగష్టు 7న లాంచ్ కానుండగా, ఐసీఈ ఇటరేషన్ ఈవీ వెర్షన్ లాంచ్ అయిన తర్వాత మరికొన్ని వారాల్లో ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టనుంది. లాంచ్ అయిన తర్వాత, కర్వ్ సెగ్మెంట్లోని హ్యుందాయ్ క్రెటా, సిట్రోన్ బసాల్ట్, కియా సెల్టోస్, హోండా ఎలివేట్ మరియు ఇతర మిడ్-సైజ్ ఎస్యువి లతో పోటీపడనుంది. అంతే కాకుండా, ఈవీ వెర్షన్ హ్యుందాయ్ క్రెటా ఈవీ, ఎంజి ZS ఈవీ మరియు బివైడి అట్టో 3 వంటి మోడళ్లకు కూడా పోటీగా ఉండనుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప