- 2024 ఆగస్టు 7వ తేదీన అరంగేట్రం
- ఆరు ఎక్స్‌టీరియర్ కలర్లలో వస్తున్న ఐసీఈ కర్వ్
టాటా కర్వ్ 2024 ఆగస్టు 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అరంగేట్రం చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. టాటా నుంచి వస్తున్న ఈ మొట్టమొదటి కూపే మొత్తం పెట్రోల్, డీజిల్ మరియు ఎలక్ట్రిక్ వెర్షన్లలో అందించబడుతుండగా, మార్కెట్లో ఈ మోడల్ మిడ్-సైజ్ ఎస్‍యూవీ సెగ్మెంట్ కార్లతో పోటీపడుతుంది. ఇప్పుడు, లాంచ్ కి ముందుగా, టాటా కర్వ్ ఐసీఈ వెర్షన్ ఫ్లేమ్ రెడ్ కలర్లో కనిపించగా, దీనికి సంబంధించిన మరిన్ని ఫోటోలను కలిగి ఉన్నాము.
టాటా కర్వ్ ఇప్పుడు మొత్తం ఆరు ఎక్స్‌టీరియర్ కలర్లలో అందించబడుతుండగా, అందులో ఫ్లేమ్ రెడ్, ఒపేరా బ్లూ, కాస్మిక్ గోల్డ్, ప్రిస్టిన్ వైట్, డేటోనా గ్రే, మరియు ప్యూర్ గ్రే వంటి కలర్లు ఉన్నాయి. ఇక్కడ పేర్కొన్న అన్నీ కలర్లు డ్యూయల్-టోన్ కలర్లలో కూడా అందించబడనున్నాయి.
ఫోటోలో కనిపిస్తున్న విధంగా, టాటా కర్వ్ ఒకే రకమైన రియర్ ప్రొఫైల్ తో కూపే లాంటి బాడీ స్టైల్ ని కలిగి ఉంది. ఇందులోని డిజైన్ హైలైట్లలో ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, స్క్వేర్డ్-ఆఫ్ వీల్స్ ఆర్చెస్, ఇంటిగ్రేటెడ్ ట్విన్ రియర్ స్పాయిలర్, కారు అంతటా చంకీ బ్లాక్ క్లాడింగ్, పనోరమిక్ సన్ రూఫ్, 18-ఇంచ్ ఫ్లవర్-ప్యాటర్న్డ్ అల్లాయ్ వీల్స్, మరియు కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఓవరాల్ గా, కర్వ్ లుక్స్ మరింత బెస్ట్ గా కనిపిస్తుండగా, మరియు డిజైన్ పరంగా దాని కాన్సెప్ట్ వెర్షన్ లాగా కనిపిస్తుంది.
కారు ముందు భాగంలో, కర్వ్ మోడల్ ముందు భాగం (ఫ్రంట్ ప్రొఫైల్) కూడా ఎల్ఈడీ డీఆర్ఎల్స్, స్ప్లిట్ డీఆర్ఎల్స్ హెడ్ ల్యాంప్స్, మరియు క్రోమ్-స్టడ్ స్ప్లిట్ గ్రిల్ వంటి వాటితో ఇతర టాటా మోడల్స్ లాగే ఉంటుంది.
ఫీచర్ల పరంగా చెప్పాలంటే, కర్వ్ మోడల్ దాని క్లాస్ లోని మోడల్స్ తో పోలిస్తే మరిన్ని బెస్ట్ ఫీచర్లతో ఫీచర్ రిచ్ మోడల్ గా రానుంది. ఈ కారు 12.3-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, టచ్-బేస్డ్ హెచ్‍విఎసి ప్యానెల్, ఇల్యూమినేటెడ్ లోగోతో ట్విన్-స్పోక్ స్టీరింగ్ వీల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే మరియు రివైజ్డ్ సెంటర్ కన్సోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే, పవర్డ్ డ్రైవర్ సీటు, వెనుక వరుస సీట్లకు టూ-స్టెప్ రిక్లైన్ ఫంక్షన్, 360-డిగ్రీ సరౌండ్ కెమెరా, లెవెల్-2 ఎడాస్ (ఏడీఏఎస్) సూట్ మరియు జెస్చర్ ఫంక్షన్‌తో పవర్డ్ టెయిల్‌గేట్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.
ఇంకా చెప్పాలంటే, సేఫ్టీ పరంగా టాటా కర్వ్ మోడల్ కూడా టాటా నుంచి వచ్చిన లేటెస్ట్ ఎస్‍యూవీల లాగే బిఎన్ క్యాప్ టెస్టులలో 5-స్టార్ రేటింగ్ ని అందుకుంది.
మెకానికల్ గా, టాటా కర్వ్ నుంచి వస్తున్న ఐసీఈ వెర్షన్ రెండు పెట్రోల్ ఇంజిన్లు మరియు ఒక డీజిల్ ఇంజిన్ ని కలిగి ఉంది. ఇందులో అందించబడిన 1.5-లీటర్ డీజిల్ మరియు 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్లు నెక్సాన్ నుంచి తీసుకోగా, కొత్త 1.2-లీటర్ టిజిడిఐ పెట్రోల్ ఇంజిన్ కర్వ్ మోడల్ ద్వారా దాని ప్రొడక్షన్ అరంగేట్రం చేయనుంది. ముఖ్యంగా, ఇందులో అందించబడిన ఇంజిన్లు అన్నీ 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్సు మరియు 7-స్పీడ్ డిసిటి గేర్ బాక్సుతో జతచేయబడి రానున్నాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్