- పెట్రోల్ మరియు డీజిల్ పవర్ రెండింట్లో అందించబడనున్న కర్వ్ మోడల్
- టాటా నుంచి వచ్చిన మొదటి కూపే ఎస్‍యూవీ
ఆవిష్కరణ
టాటా కర్వ్ ఐసీఈ వెర్షన్ కారు, దాని ఎలక్ట్రిక్ మోడల్ కర్వ్ ఈవీతో పాటుగా అధికారికంగా ఆవిష్కరించబడింది. ఈ కారు ద్వారా టాటా కంపెనీ డి-సెగ్మెంట్లోకి అడుగుపెడుతుంది. దీని ద్వారా, కర్వ్ మోడల్ హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్, హోండా ఎలివేట్, ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్, స్కోడా కుషాక్ మరియు ఎంజి ఆస్టర్ వంటి కార్లతో పోటీపడుతుంది.
డిజైన్ హైలైట్స్
ఫోటోల ద్వారా వెల్లడైంది ఏంటి అంటే, ఈ మోడల్ పెద్ద బంపర్లతో టాటా ఎస్‍యూవీ ఫేస్, లో-సెట్ హెడ్ ల్యాంప్స్, మరియు అధునాతన డిజైన్ తో టాటా రేంజ్ ని తలపించేలా కనుబొమ్మ షేపులో ఎల్ఈడీ వంటి వాటిని కలిగి ఉంది. కారు సైడ్ భాగాన్ని పరిశీలిస్తే, పాప్-అవుట్ డోర్ హ్యండిల్స్ మరియు పెటల్ డిజైన్ లో అందించబడిన అల్లాయ్ వీల్స్ ని మీరు చూడవచ్చు. అదే విధంగా, మందంగా కనిపించే సి-పిల్లర్ మరియు డిజైన్ లో భాగంగా రియర్ స్పాయిలర్ ని టాటా అందించగా, ఇది కారు వెనుక భాగం వరకు స్లోప్స్ తో ఉంది. మొత్తానికి, కారు వెనుక భాగంలో వన్-పీస్ లైట్ బార్ మరియు ప్యాకేజీలో భాగంగా భారీ బంపర్ కూడా అందించబడింది. ఓవరాల్ గా, టాటా కారు 2024 భారత్ మొబిలిటీ ఎక్స్ పో ప్రదర్శించబడిన కాన్సెప్ట్ కారులాగే ఉంది.
ఇంటీరియర్ మరియు ఫీచర్లు
ఇంటీరియర్ పరంగా, కర్వ్ ఐసీఈ వెర్షన్ కారు క్యాబిన్ వివరాలు వెల్లడికాకపోయినా, ఇందులో చాలా వరకు నెక్సాన్ మరియు హారియర్ కార్లలో చూసిన ఫీచర్లను మనం చూడవచ్చు. కర్వ్ ఐసీఈ వెర్షన్ కారు లెవెల్-2 ఎడాస్(ఏడీఏఎస్), 360-డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, పవర్డ్ డ్రైవర్ సీటు, డ్యూయల్ డిజిటల్ స్క్రీన్స్ మరియు అలాగే పవర్డ్ టెయిల్‌గేట్ వంటి ఫీచర్లతో వస్తుందని భావిస్తున్నాం.
ఇంజిన్ ఆప్షన్లు
టాటా కర్వ్ ఐసీఈ వెర్షన్ కారు 1.2-లీటర్ జిడిఐ టర్బో-పెట్రోల్ ఇంజిన్ తో రానుండగా, ఈ ఇంజిన్ 6 –స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్పీడ్ డిసిటి గేర్ బాక్సుతో జతచేయబడి 123bhp/225Nm టార్కును ఉత్పత్తి చేయనుంది. మరోవైపు, టాటా కంపెనీ కర్వ్ ఐసీఈ వెర్షన్ కారులో 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ ని అందిస్తుండగా, ఈ ఇంజిన్ 6 –స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 6-స్పీడ్ ఎటి గేర్ బాక్సుతో జతచేయబడి 113bhp/260Nm టార్కును ఉత్పత్తి చేయనుంది. ఇదే ఇంజిన్ హారియర్ మరియు సఫారీ కార్లలో కూడా అందించబడింది.
ఇంకా ధరల విషయానికి వస్తే, టాటా కర్వ్ ఈవీ ధరలు ఆగస్టు 7వ తేదీన ప్రకటించబడనుండగా, 10 రోజుల తర్వాత కర్వ్ ఐసీఈ మోడల్ ధరలు ప్రకటించే అవకాశం ఉందని మేము భావిస్తున్నాం. నెక్సాన్ ఈవీ మరియు నెక్సాన్ ఐసీఈ వెర్షన్ కార్ల విషయంలో కూడా సరిగ్గా ఇలాగే జరిగింది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్