- నేడే రూ.17.49 లక్షలతో లాంచ్ అయిన కర్వ్ ఎలక్ట్రిక్ కారు
- 8 వేరియంట్లు మరియు ఐదు కలర్లలో లభించనున్న కర్వ్ ఐసీఈ వెర్షన్
అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తూ టాటా మోటార్స్ కర్వ్ ఎలక్ట్రిక్ కారును ఇండియాలో లాంచ్ చేయగా, వీటి ఎక్స్-షోరూం ధరలు రూ.17.49 లక్షలతో ప్రారంభమయ్యాయి. ఎన్నో సంభ్రమాశ్చర్యాల మధ్య ఐసీఈ వెర్షన్ ధరలను మాత్రం ఇంకా వెల్లడించలేదు. వీటి ధరలను సెప్టెంబర్ 2వ తేదీన ప్రకటించనున్నట్లు టాటా మోటార్స్ కర్వ్ ఈవీ లాంచ్ ఈవెంట్లో పేర్కొంది.
టాటా కర్వ్ కారు 1.2-లీటర్ టర్బో-పెట్రోల్, కొత్త 1.2-లీటర్ జిడిఐ టర్బో-పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్లతో అందుబాటులోకి రానుంది. కర్వ్ కారులో ప్రత్యేకంగా హైపీరియన్ అనే కొత్త టిజిడిఐ ఇంజిన్ ని టాటా బ్రాండ్ తీసుకురానుంది. ఈ ఇంజిన్ 123bhp మరియు 225Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో 6-స్పీడ్ మాన్యువల్ మరియు 7-స్పీడ్ డిసిటి యూనిట్ వంటివి ఉన్నాయి. ముఖ్యంగా, ఇండియాలో ఈ కారు మొదటిసారిగా డీజిల్ ఇంజిన్ డిసిఎతో అందించబడుతుంది. ( డిసిటి అని కూడా అంటారు)
ముందుగా డిజైన్ గురించి చెప్పాలంటే, టాటా కర్వ్ కారు స్ప్లిట్ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్, ఎల్ఈడీహెడ్‌లైట్స్, ఫ్రంట్ మరియు రియర్ ఎల్ఈడీలైట్ బార్స్, ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, ఎల్ఈడీటెయిల్‌లైట్లు మరియు స్లోపింగ్ రూఫ్‌లైన్ వంటి ఫీచర్లను పొందనుంది.
ఇంటీరియర్ పరంగా, కర్వ్ కారు లోపల పనోరమిక్ సన్‌రూఫ్, 12.3-ఇంచ్ టచ్‌స్క్రీన్ సిస్టమ్, ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, రియర్ ఏసీవెంట్స్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, పవర్డ్ టెయిల్‌గేట్, ఆటో-హోల్డ్ ఫంక్షన్‌తో కూడిన ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, లెవెల్-2 ఎడాస్ (ఏడీఏఎస్)సూట్, వైర్‌లెస్ ఛార్జర్ మరియు మరెన్నో ఫీచర్లతో వస్తుంది. కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు కర్వ్ కారును ఐదు కలర్లు మరియు ఎనిమిది వేరియంట్ల నుండి సెలెక్ట్ చేసుకోవచ్చు.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్