- 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ తో పొందనున్న కర్వ్ మోడల్
- నెక్సాన్ ఫేస్‍లిఫ్ట్ సిఎన్‍జితో పాటుగా ప్రదర్శించబడనున్న కర్వ్
భారత్ మొబిలిటీ ఎక్స్‌పో-2024 అధికారిక ప్రదర్శనకు మనం కేవలం ఓకే ఒక్కరోజు దూరంలో ఉన్నాము. ఇప్పటికే, వివిధ ఆటోమొబైల్ కంపెనీలు వాటికి కేటాయించిన ఆయా స్టాల్స్ లో వారు ఏమేం ప్రదర్శించనున్నారో సోషల్ మీడియా, ఇంటర్నెట్ వేదికగా సమాచారాన్ని అందిస్తున్నారు. వీటి విషయానికి వస్తే ముందుగా, టాటా మోటార్స్ దాని ప్రోడక్ట్-లైనప్ లో వస్తున్న వివిధ మోడల్స్ యొక్క స్పెసిఫికేషన్లను వెల్లడించింది, అందులో ఐసీఈ కర్వ్ కూడా ఉంది.
రాబోయే ఎస్‍యూవీ ఐసీఈ వెర్షన్లో వస్తున్నట్లు ఆటోమేకర్ నిర్ధారించింది. ప్రస్తుతం, టాటా నెక్సాన్ ఫేస్‍లిఫ్ట్ లో ఉపయోగిస్తున్న పవర్డ్ 1.5-లీటర్ 4-సిలిండర్ డీజిల్ ఇంజిన్ టాటా కర్వ్ మోడల్ లో కూడా రానుంది.ఈ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్సుతో జతచేయబడి 113bhp పవర్ మరియు 260Nm టార్కు ఉత్పత్తి చేసేలా ట్యూన్ చేయబడింది. డైమెన్షన్స్ పరంగా, కర్వ్ 4,308ఎంఎం పొడవు, 1,810ఎంఎం వెడల్పు, మరియు 1,630ఎంఎం పొడవు ఉంది. అలాగే, ఇది 422 లీటర్ల బూట్ స్పేస్ తో 2,560ఎంఎం వీల్ బేస్ ని కలిగి ఉంది.
ముందుగా ఇందులో ఉన్న ఫీచర్స్ గురించి చెప్పాలంటే, చాలా వరకు టాటా కర్వ్ ఫీచర్స్ నెక్సాన్ లో ఉన్నట్లుగానే ఉంటాయని భావిస్తున్నాం. ఇందులో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్‌ప్లేతో 10.25-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, 10.25-ఇంచ్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్, మధ్యలో ఇల్యూమినేటెడ్ లోగోతో టూ-స్పోక్ స్టీరింగ్ వీల్, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్,వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, ఎయిర్ ప్యూరిఫైయర్, మరియు ప్రీమియం ఆడియో సిస్టం వంటి ఫీచర్స్ ఉండే అవకాశం ఉంది.
ఇతర వార్తలలో చూస్తే, టాటా మోటార్స్ భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో నెక్సాన్ ఫేస్‍లిఫ్ట్ సిఎన్‍జి వేరియంట్ ని పరిచయం చేసేందుకు సిద్ధమైంది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు మా కార్‌వాలే వెబ్ సైట్లో అందుబాటులో ఉన్నాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్