- రూ.10 లక్షలతో కర్వ్ ధరలు ప్రారంభం
- ఎనిమిది వేరియంట్లలో మూడు పవర్ ట్రెయిన్లతో అందించబడిన టాటా కర్వ్
ఈ వారం ప్రారంభంలో కర్వ్ కూపే ఎస్‍యూవీ కారులోని ఐసీఈ వెర్షన్లను (పెట్రోల్, డీజిల్ కర్వ్ కార్లు) రూ.10 లక్షల ఎక్స్-షోరూం ప్రారంభ ధరలతో టాటా మోటార్స్ చేసింది. అయితే, 2024 అక్టోబర్ 31వ తేదీకి ముందుగా చేసుకున్న బుకింగ్స్ కి మాత్రమే ప్రస్తుత ధరలు వర్తిస్తాయి.
దేశవ్యాప్తంగా ఉన వివిధ షోరూంలకు ఇదివరకే టాటా కర్వ్ మోడల్ చేరుకోగా, దీనికి సంబంధించిన టెస్ట్ డ్రైవ్స్ త్వరలోనే ప్రారంభంకానున్నాయి. సిట్రోన్ బసాల్ట్ కారుతో పోటీపడుతున్న కర్వ్ కారు బుకింగ్స్ సెప్టెంబర్ 2వ తేదీన ప్రారంభం కాగా, సెప్టెంబర్ 12వ తేదీ నుంచి వీటి డెలివరీ షెడ్యూల్ చేయబడింది.
కర్వ్ కూపే ఎస్‍యూవీ డిజైన్ హైలైట్లలో స్లోపింగ్ రూఫ్ లైన్, ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యండిల్స్, స్ప్లిట్ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడీ లైట్ బార్స్, ఎల్ఈడీ టెయిల్ లైట్స్, మరియు మల్టీ-స్పోక్ అల్లాయ్ వీల్స్ వంటివి ఉన్నాయి. ఇంటీరియర్ పరంగా, కర్వ్ కారు లోపల పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 12.3-ఇంచ్ టచ్‌స్క్రీన్ యూనిట్, ఫుల్ డిజిటల్ కలర్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు 360-డిగ్రీ కెమెరా వంటి అద్బుతమైన ఫీచర్లు ఉన్నాయి. ఇంకా ఇందులో గుర్తించదగిన ముఖ్యమైన ఫీచర్లలో జెస్చర్ కంట్రోల్ టెయిల్ గేట్, టూ-స్టెప్ రిక్లైనింగ్ రియర్ సీట్లు, వైర్ లెస్ ఛార్జింగ్, కూల్డ్ గ్లోవ్ బాక్స్, మరియు లెవెల్-2 ఎడాస్ (ఏడీఏఎస్) సూట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
కొత్త టాటా కర్వ్ కారు మూడు ఇంజిన్ ఆప్షన్లతో అందుబాటులోకి వచ్చింది. అందులో 1.2-లీటర్ టర్బో-పెట్రోల్, 1.2-లీటర్ జిడిఐ టర్బో-పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ వంటివి ఉన్నాయి. ఈ ఇంజిన్లు అన్నీ 6-స్పీడ్ మాన్యువల్ మరియు 7-స్పీడ్ డిసిటి యూనిట్లతో జతచేయబడి వచ్చాయి. ఇంకా పోటీ విషయానికి వస్తే, టాటా కర్వ్ కారుకు సిట్రోన్ బసాల్ట్ కారు గట్టిపోటీని ఇవ్వనుంది. త్వరలోనే మేము కర్వ్ ఐసీఈ వెర్షన్ కారును డ్రైవ్ చేయబోతున్నాము. త్వరలోనే పూర్తి రివ్యూను మీకు అందించబోతున్నాము.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్