- రూ.10 లక్షలతో ధరలు ప్రారంభం
- బుకింగ్స్ ప్రారంభం; ఈ వారం చివరలో ప్రారంభంకానున్న డెలివరీ
గత వారంలో, టాటా మోటార్స్ కర్వ్ కూపే ఎస్‍యూవీ ధరలను ప్రకటించింది. బేస్ వేరియంట్ ఎక్స్-షోరూం ధర రూ.10 లక్షలతో ప్రారంభం కాగా, బేస్ వేరియంట్ ఎలా ఉంటుందో చూపించడానికి, దీనికి సంబంధించిన ఫోటోలను టాటా రిలీజ్ చేసింది. టాటా కర్వ్ బేస్ వేరియంట్లో ఏయే ఫీచర్లు లభిస్తాయో వీటిని మనం ఓసారి పరిశీలిద్దాం.
ఎక్స్‌టీరియర్ పరంగా, కర్వ్ బేస్ వేరియంట్ కారు బయట వైపు స్ప్లిట్ హెడ్ ల్యాంప్ డిజైన్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్, బ్లాక్డ్-అవుట్ గ్రిల్ మరియు ఓఆర్‌విఎం, ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యండిల్స్, మరియు వీల్ కవర్లు లేకుండా స్టీల్ వీల్స్ వంటి డిజైన్ హైలైట్లను కలిగి ఉంది. అదనంగా, ఈ కారు కారు ఫ్రంట్ డోర్లపై Curvv లెటరింగ్, ఎల్ఈడీ టెయిల్ లైట్స్, మరియు స్లోపింగ్ రూఫ్ లైన్ ని పొందింది. కారు ముందు మరియు వెనుక భాగాలలో ప్రాముఖ్యమైన డిజైన్ అంశంగా పేర్కొనే ఎల్ఈడీ లైట్ బార్స్ ఈ బేస్ వేరియంట్లో మిస్ అయ్యాయి.
ఇంటీరియర్ పరంగా చూస్తే, టాటా కర్వ్ బేస్ వేరియంట్ కారు లోపల డ్యూయల్-టోన్ థీమ్, టాటా ఇల్యూమినేటెడ్ లోగోతో టూ-స్పోక్ ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, డ్రైవ్ మోడ్స్, మాన్యువల్ హ్యాండ్ బ్రేక్, ఏసీ కంట్రోల్ కోసం అనువైన బటన్లు, 6 ఎయిర్ బ్యాగ్స్, మరియు ఎ-పిల్లర్-మౌంటెడ్ ట్వీటర్ల వంటి ఫీచర్లను పొందింది. అతి ముఖ్యమైన విషయం ఏంటి అంటే, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఎడాస్ (ఏడీఏఎస్)సూట్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, జెస్చర్-కంట్రోల్ టెయిల్‌గేట్, పనోరమిక్ సన్‌రూఫ్, ఆటో-డిమ్మింగ్ ఐఆర్‌విఎంమరియు 360-డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు ఇందులో మీకు లభించవు.
బానెట్ కింద, కర్వ్ బేస్ వేరియంట్లో కేవలం ఒకేఒక్క 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్లతో జతచేయబడి అందించబడింది. కర్వ్ బేస్ వేరియంట్ లోని పెట్రోల్ ఇంజిన్ 118bhp మరియు 170Nm టార్కును ఉత్పత్తి చేస్తుండగా, డీజిల్ ఇంజిన్ 116bhp మరియు 260Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఇంకా చెప్పాలంటే, కర్వ్ పెట్రోల్ మరియు డీజిల్ కార్ల బుకింగ్స్ ని టాటా మోటార్స్ ప్రారంభించగా, 2024 సెప్టెంబర్ 12వ తేదీ నుంచి వీటి డెలివరీ ప్రారంభమవుతుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్