- పూర్తి 5-స్టార్ రేటింగ్ స్కోర్ చేసిన కర్వ్ ఈవీ
- లేటెస్టుగా నెక్సాన్ మరియు కర్వ్ ఐసీఈ కార్లపై కూడా జరిగిన బిఎన్ క్యాప్ క్రాష్ టెస్ట్
లేటెస్టుగా బిఎన్ క్యాప్ దాని క్రాష్ టెస్ట్ రిజల్ట్స్ రిలీజ్ చేయగా, అందులో టాటా నెక్సాన్, టాటా కర్వ్, టాటా కర్వ్ ఈవీ వంటి వివిధ మోడల్స్ ఉన్నాయి. ఈ ఆర్టికల్ ద్వారా, బిఎన్ క్యాప్ టెస్టులో కర్వ్ ఎలక్ట్రిక్ కారు ఎలాంటి రిజల్ట్స్ సాధించిందో ఓసారి తెలుసుకుందాం.
అందరిని ఆశ్చర్యపరిచేలా టాటా కర్వ్ ఈవీ కారుకు భారత్ ఎన్ క్యాప్ క్రాష్ టెస్టులో 5-స్టార్ రేటింగ్ లభించింది. ఈ కూపే-ఎస్‍యూవీ అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్లో 32 పాయింట్లకు గాను 30.81 పాయింట్లు స్కోర్ చేయగా, చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్లో 49 పాయింట్లకు గాను 44.83 పాయింట్లు స్కోర్ చేసింది. ఇంకా చెప్పాలంటే, పైన పేర్కొన్న ఈ 5-స్టార్ రేటింగ్ కర్వ్ ఈవీలోని అన్నీ వేరియంట్లకు వర్తిస్తుంది.
సేఫ్టీ ఫీచర్ల పరంగా, కొత్త టాటా కర్వ్ ఈవీ 6 ఎయిర్ బ్యాగ్స్, ఈబీడీతో ఏబీఎస్, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ మరియు కెమెరా, సీట్ బెల్ట్ రిమైండర్ సిస్టం, స్పీడ్ అలర్ట్ సిస్టం, అన్నీ వీల్ డిస్క్ బ్రేక్స్, రివర్స్ పార్కింగ్ కెమెరా, మరియు ఆటో హోల్డ్ ఫంక్షన్ తో ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ (ఈపీబీ) వంటి ఫీచర్లను స్టాండర్డ్ గా పొందింది. అదనంగా, ఈ కారు లెవెల్-2 ఎడాస్ (ఏడీఏఎస్) సూట్, ఈఎస్‍సీ, బ్లైండ్ స్పాట్ మానిటర్, ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్ మరియు డీఫాగర్, మరియు రెయిన్-సెన్సింగ్ వైపర్లను కూడా కలిగి ఉంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్