- మొదట ఈవీ లుక్ లో లాంచ్ కానున్న కర్వ్ మోడల్
- ఈ సెగ్మెంట్లో మొదటి కూపే ఎస్‍యూవీ ఇదే
కొన్ని నెలలుగా టాటా కర్వ్ మోడల్ కి సంబంధించి ఊహాగానాలు, స్పై ఫోటోలు, ప్రెజెంటేషన్ల ద్వారా ఇంటర్నెట్ నిండా కథనాలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. అయితే, ఎన్నో ప్రెజెంటేషన్ల తర్వాత ఎట్టకేలకుటాటా కర్వ్ కి సంబంధించిన వార్తలు నిజం కాబోతున్నాయి. ఆటోమేకర్ రాబోయే (అప్ కమింగ్) కర్వ్కూపే ఎస్‍యూవీకి చెందిన మొట్టమొదటి అధికారిక టీజర్‌ను రిలీజ్ చేసింది. ఇది ముందుగా ఈవీ లుక్ లోలాంచ్ అవ్వడానికి సిద్ధంగా ఉండగా,ఆ తర్వాత కర్వ్ మోడల్ ఐసీఈ వెర్షన్లోలాంచ్ కానుంది.
టాటా కర్వ్ ఈవీ కూపే బాడీ స్టైల్‌తో గ్రౌండ్-అప్ ఆల్-ఎలక్ట్రిక్ మోడల్ గా వస్తుంది. కర్వ్ మోడల్ లోని కొన్ని డిజైన్ హైలైట్లను చూస్తే, కారు ముందు భాగంలో పూర్తి వెడల్పైన లైట్ బార్, స్ప్లిట్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, అగ్రెసివ్ లుక్ తో కనిపించే గ్రిల్ మరియు బంపర్, స్లోపింగ్ రూఫ్‌లైన్, ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్ మరియు కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్‌లైట్లు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే, ఇందులోని రిఫ్లెక్టర్ డిజైన్ మరియు కారు వెనుకవైపు పొజిషనింగ్ నెక్సాన్ కారు మాదిరిగా ఉండనుంది.
ఫీచర్ల పరంగా చూస్తే, కర్వ్ ఈవీ వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేతో కూడిన ఫ్రీ-స్టాండింగ్ 12-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆల్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఇల్యూమినేటెడ్ టాటా లోగోతో ట్విన్-స్పోక్ స్టీరింగ్ వీల్, టచ్-బేస్డ్ హెచ్‌విఎసి కంట్రోల్స్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఆటో-డిమ్మింగ్ ఐఆర్‌విఎం, 360-డిగ్రీ సరౌండ్ కెమెరా మరియు ఎడాస్ (ఏడీఏఎస్)టెక్ వంటి అద్బుతమైన ఫీచర్లతో రానుంది.
మనం దీని లేటెస్టు స్పై ఫోటోలను పరిశీలిస్తే, పైన పేర్కొన్న ఫీచర్లు మాత్రమే కాకుండా, కర్వ్ ఈవీ మోడల్డ్యూయల్-పేన్ పనోరమిక్ సన్‌రూఫ్‌తో కూడా రానుంది. అలాగే, బ్యాటరీ ప్యాక్ మరియు స్పెసిఫికేషన్ల విషయానికొస్తే, కర్వ్ ఈవీ నెక్సాన్ ఈవీ బ్యాటరీ ఒకే మోటార్ సెటప్‌తో ఫ్రంట్ వీల్స్ కి పవర్ ని సప్లై చేయనుంది. ఇంకా, కర్వ్ పెద్ద ఎస్‍యూవీలలో ఒకటిగా మొదట వస్తుండగా మరియు హ్యుందాయ్ క్రెటా ఈవీ, కియా కారెన్స్ ఈవీ, హోండా ఎలివేట్ ఈవీ, మహీంద్రా XUV.e8, మారుతి eVX మరియు టయోటా అర్బన్ స్పోర్ట్ వంటి కార్ల సరసన టాటా కర్వ్ ఈవీ కారు చేరనుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్