టాటా మోటార్స్ ఇండియాలో ఈ రోజు కర్వ్ ఈవీని లాంచ్ చేసింది. దీని ధరలు 17.49 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమయ్యాయి. కొత్త కూపే ఎస్‍యూవీ బుకింగ్‌లు ఆగస్టు 12న ప్రారంభం కానుండగా, ఆ తర్వాత టెస్ట్ డ్రైవ్స్ ఆగస్టు 14న ప్రారంభిస్తున్నట్లు టాటా బ్రాండ్ పేర్కొంది.
కర్వ్ ఈవీ రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ తో అందించబడింది. అందులో45kWh యూనిట్ మరియు 55kWh యూనిట్ బ్యాటరీ ప్యాక్స్ ఉన్నాయి,ఈ రెండూ ఒకే ఎలక్ట్రిక్ మోటార్‌తో జత చేయబడి వచ్చాయి. ఈ రేంజ్ లో ఉన్న మొదటి 45kWh యూనిట్ బ్యాటరీ ప్యాక్ 502కిలోమీటర్లు డ్రైవింగ్ రేంజ్ ని మరియు 55kWh యూనిట్ బ్యాటరీ ప్యాక్ 585కిలోమీటర్ల క్లెయిమ్ చేయబడిన డ్రైవింగ్ రేంజ్ ని అందిస్తాయి.
కొత్త టాటా కర్వ్ ఈవీ ఫ్లేమ్ రెడ్, ఎంపవర్డ్ ఆక్సైడ్, ప్రిస్టీన్ వైట్, ప్యూర్ గ్రే మరియు వర్చువల్ సన్‌రైజ్ అనే 5 కలర్లలో అందుబాటులో కి వచ్చింది.కస్టమర్‌లు క్రియేటివ్, అకాంప్లిష్డ్, అకాంప్లిష్డ్+S, ఎంపవర్డ్+ మరియు ఎంపవర్డ్+ ఎ అనే 5 వేరియంట్‌ల నుండి కర్వ్ ఈవీని ఎంచుకోవచ్చు. వేరియంట్ వారీగా కర్వ్ ఈవీలో అందించబడిన కీలకమైన ఫీచర్స్ క్రింద ఇవ్వబడ్డాయి.
కర్వ్ ఈవీ క్రియేటివ్ 6 ఎయిర్‌బ్యాగ్స్ ఐ-విబిఎసితో ఈఎస్ పీ ఆల్-వీల్ డిస్క్ బ్రేక్స్ ఆటో-హోల్డ్ ఫంక్షన్‌తో ఈపీబీ ప్యాడిల్ షిఫ్టర్‌లతో మల్టీ-మోడ్ రీజెన్ డ్రైవ్ మోడ్స్ (ఎకో, సిటీ మరియు స్పోర్ట్) V2V మరియు V2L టెక్నాలజీ iRA.ev మరియు స్మార్ట్‌వాచ్ కనెక్టివిటీ స్మార్ట్ డిజిటల్ డిఆర్ఎల్స్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్ 17-ఇంచ్ హైపర్‌స్టైల్ వీల్స్ కెమెరా మరియు సెన్సార్ ఆధారిత రివర్స్ పార్క్ అసిస్ట్ 7- ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ 7 -ఇంచ్ టిఎఫ్ టి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ 6-విధాలుగా సర్దుబాటు చేయగల డ్రైవర్ సీట్ క్రూయిజ్ కంట్రోల్ రియర్ ఏసీ వెంట్స్ ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల ఒఆర్‍విఎంస్ 7.2kW ఏసీ ఫాస్ట్ ఛార్జర్ వాల్ బాక్స్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఐ - టీపీఎంఎస్ |
కర్వ్ ఈవీ అకాంప్లిష్డ్ ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ ఎల్ఈడీ లైట్ బార్స్ సీక్వెన్షియల్ ఇండికేటర్స్ కార్నరింగ్ ఫంక్షన్‌తో ఫాగ్ లైట్స్ ఏరో ఇన్సర్ట్‌లతో కూడిన 17-ఇంచ్ అల్లాయ్ వీల్స్ 10.25-ఇంచ్ టచ్‌స్క్రీన్ సిస్టమ్ 10.25-ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ కూల్డ్ గ్లోవ్ బాక్స్ లెథెరెట్ అప్హోల్స్టరీ టీపీఎంఎస్ అలెక్సా వాయిస్ అసిస్టెంట్ |
కర్వ్ ఈవీ అకాంప్లిష్డ్+ S 360-డిగ్రీ కెమెరా మరియు బ్లైండ్ స్పాట్ మానిటర్ ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ పనోరమిక్ సన్‌రూఫ్ Arcade.ev యాప్ సూట్ జెబిఎల్ సౌండ్ మోడ్స్ వైర్‌లెస్ మొబైల్ ఛార్జర్ ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్ రెయిన్-సెన్సింగ్ వైపర్స్ |
కర్వ్ ఈవీ ఎంపవర్డ్+ ఛార్జింగ్ ఇండికేటర్స్ మరియు వెల్కమ్ మరియు గుడ్ బై ఫంక్షన్‌తో స్మార్ట్ డిజిటల్ లైట్స్ యాంబియంట్ లైటింగ్ మూడ్ లైటింగ్‌తో కూడిన వాయిస్-అసిస్టెడ్ పనోరమిక్ సన్‌రూఫ్ 6-విధాలుగా పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ 12.3-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ 9-స్పీకర్ జెబిఎల్ సౌండ్ సిస్టమ్ (సబ్-వూఫర్‌తో) అకౌస్టిక్ వెహికల్ అలర్ట్ సిస్టమ్ (ఏవీఏఎస్) ఏక్యూఐ డిస్‌ప్లేతో కూడిన ఎయిర్ ప్యూరిఫైయర్ ఆటో-డిమ్మింగ్ ఐఆర్‍విఎం వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్ రెండవ వరుస సీట్స్ కోసం రెండు-స్టెప్ రిక్లైన్ ఫంక్షన్ ఫ్రాంక్ |
కర్వ్ ఈవీ ఎంపవర్డ్+ ఎ లెవెల్ 2 ఏడీఏఎస్(ఎడాస్) జెస్చర్ కంట్రోల్ తో పవర్డ్ టెయిల్‌గేట్ ఎస్ఓఎస్ కాలింగ్ ఫంక్షన్ |
అనువాదించిన వారు: రాజపుష్ప