- ఫోర్-స్పోక్ స్టీరింగ్ వీల్ ని పొందనున్న కర్వ్
- 7 ఆగస్టు, 2024న ధరలు ప్రకటన
టాటా మోటార్స్ కర్వ్ ఈవీని 7 ఆగస్టు, 2024న లాంచ్ చేయనుండగా, దాని కంటే ముందు మరొక టీజర్‌ను రిలీజ్ చేసింది. అలాగే, వచ్చే నెలాఖరు నాటికి ఈవీ వెర్షన్ తర్వాత ఐసీఈ డెరివేటివ్ లాంచ్ కానుంది.
టాటా షేర్ చేసిన కొత్త వీడియోలో, టాటా కర్వ్ ఈవీ గ్రౌండ్ క్లియరెన్స్ మరియు మరిన్ని అంశాలను ప్రదర్శించడానికి దానిని సందక్‌ఫు (అనే ఒక ప్రాంతానికి) రోడ్లపైకి తీసుకువెళ్లింది. ఇంటీరియర్ వివరాలని పరిశీలిస్తే, హారియర్ మరియు సఫారి నుండి తీసుకోబడిన ఫోర్-స్పోక్ స్టీరింగ్ వీల్, పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 12.3-ఇంచ్ టచ్‌స్క్రీన్ సిస్టమ్, డాష్‌బోర్డ్‌పై ఫాక్స్ కార్బన్-ఫైబర్ ఫినిషింగ్ మరియు రెడ్ యాంబియంట్ లైటింగ్ వంటి కీలక ఫీచర్లు ఇందులో కనిపిస్తాయి.
మరోవైపు, కొత్త కర్వ్కూపే ఎస్‌యువి ఏ-పిల్లర్-మౌంటెడ్ ట్వీటర్స్, ఆటో-డిమ్మింగ్ ఒఆర్‍విఎంఎస్, ఏడీఏఎస్(ఎడాస్) స్విచ్ మరియు స్టీరింగ్ వీల్‌పై ఇల్యూమినేటెడ్ లోగో, ఏసీ ఫంక్షన్‌ల కోసం టచ్ కంట్రోల్స్, ఇంజిన్ స్టార్ట్-స్టాప్ బటన్ మరియు క్రోమ్ డోర్ హ్యాండిల్స్‌ను పొందుతుంది.
2024 టాటా కర్వ్ ఎలక్ట్రిక్ రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ తో అందుబాటులోకి వస్తుంది. అదేవిధంగా, టాప్-స్పెక్ వెర్షన్‌లు ఒకే విధమైన ఎలక్ట్రిక్ మోటార్‌తో జత చేయబడిన 55kWh యూనిట్ ని పొందుతాయి. అలాగే, ఈ వెర్షన్‌లు ఒక్కసారి పూర్తి ఛార్జ్‌పై 600కిలోమీటర్ల క్లెయిమ్ చేసిన రేంజ్ ని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. మరోవైపు, కర్వ్ లో అందించబడే లోయర్-స్పెక్ వెర్షన్‌లు నెక్సాన్ ఈవీ వెర్షన్ నుండి 40.5kWh యూనిట్‌ను తీసుకోవచ్చు.
అనువాదించిన వారు: రాజపుష్ప