- 5 ఎక్స్టీరియర్ కలర్ ఆప్షన్లలో అందించబడుతున్న మోడల్
- ప్రస్తుతం అందుబాటులో ఉన్న 3 వెర్షన్స్
టాటా మోటార్స్ ఇటీవలే ఇండియాలో న్యూ ఆల్-ఎలక్ట్రిక్ కూపే ఎస్‌యువిని లాంచ్ చేసింది, కర్వ్ ఈవీ రూ. 17.49 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో అందుబాటులోకి వచ్చింది. ఈ న్యూ ఎలక్ట్రిక్ ఎస్యువి ప్రస్తుతం 45kWh మరియు 55kWh యూనిట్ అనే రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ తో క్రియేటివ్, అకాంప్లిష్డ్ మరియు ఎంపవర్డ్ అనే మూడు వెర్షన్లలో అందించబడుతోంది.
టాటా కర్వ్ ఈవీని వర్చువల్ సన్‌రైజ్, ప్యూర్ గ్రే, ప్రిస్టిన్ వైట్, ఫ్లేమ్ రెడ్ మరియు ఎంపవర్డ్ ఆక్సైడ్ అనే 5 ఎక్స్టీరియర్ కలర్లతోపొందవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే, టాప్-స్పెక్ ఎంపవర్డ్ వెర్షన్ ఒక్కటే పూర్తి 5 కలర్ ఆప్షన్లను పొందగా, క్రియేటివ్ మరియు అకాంప్లిష్డ్ వేరియంట్లు (విడివిడిగా) ఒక్కొక్కటి మూడు కలర్ల స్కీమ్‌లను పొందాయి.
క్రియేటివ్ | అకాంప్లిష్డ్ | ఎంపవర్డ్ |
ప్యూర్ గ్రే | ఫ్లేమ్ రెడ్ | ప్యూర్ గ్రే |
ప్రిస్టీన్ వైట్ | ప్రిస్టీన్ వైట్ | ప్రిస్టీన్ వైట్ |
వర్చువల్ సన్‌రైజ్ | వర్చువల్ సన్‌రైజ్ | వర్చువల్ సన్‌రైజ్ |
- | - | ఫ్లేమ్ రెడ్ |
- | - | ఎంపవర్డ్ ఆక్సైడ్ |
అంతేకాకుండా, ఇంటీరియర్ థీమ్‌ను కస్టమర్ ఎంచుకున్న వేరియంట్‌ని బట్టి దీనిని మరింత కస్టమైజ్డ్ చేసి పొందవచ్చు. ఉదాహరణకు, క్రియేటివ్ ట్రిమ్ డ్యూయల్-టోన్ బ్లాక్ అండ్ బ్లూ థీమ్‌ను పొందుతుంది, బ్లాక్ అండ్ బర్గుండి థీమ్ తో అకాంప్లిష్డ్ వేరియంట్లను పొందవచ్చు మరియు టాప్-స్పెక్ ఎంపవర్డ్ వెర్షన్స్ బ్లాక్ అండ్ వైట్ థీమ్ క్యాబిన్‌తో అందించబడుతున్నాయి.
వీటి ధరల విషయానికొస్తే, క్రియేటివ్ వెర్షన్లు రూ. 17.49 లక్షలు ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరతో అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా, అకాంప్లిష్డ్ వేరియంట్లు రూ. 18.49 లక్షలు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో మరియు ఎంపవర్డ్ వేరియంట్లు 21.25 లక్షలు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో అందుబాటులో ఉన్నాయి.
అనువాదించిన వారు: రాజపుష్ప