- అయిదు కలర్లు మరియు అయిదు వేరియంట్లలో లభ్యం
- రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో అందించబడిన కర్వ్ ఈవీ
టాటా కార్లను ఇష్టపడే వారికి టాటా మోటార్స్ ఒక గుడ్ న్యూస్ ని తీసుకువచ్చింది. అదేంటి అంటే, కర్వ్ ఎలక్ట్రిక్ కార్ల డెలివరీని ప్రారంభించింది. కర్వ్ ఈవీ ధరలు ప్రకటించి కనీసం మూడు వారాలు కూడా కాలేదు. అప్పుడే, ఈ ఎలక్ట్రిక్ కార్ల డెలివరీ దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. ఓ రకంగా దీన్ని బట్టి చూస్తే, టాటా కంపెనీ కార్ల డెలివరీ వేగాన్ని పెంచిందని చెప్పవచ్చు. ఈ కూపే ఎస్‍యూవీ ఆగస్టు నెల ప్రారంభంలో ఇండియాలో లాంచ్ కాగా, వీటి ఎక్స్-షోరూం ధరలు రూ.17.49 లక్షల నుంచి ప్రారంభమయ్యాయి. అయితే, లేటెస్టుగా లాంచ్ అయిన కర్వ్ ఎలక్ట్రిక్ కారును మేము డ్రైవ్ చేశాము, దీనికి సంబంధించిన రివ్యూ కూడా కార్ వాలే వెబ్ సైటులో అందుబాటులో ఉంది.
కొత్త కర్వ్ ఎలక్ట్రిక్ కారు క్రియేటివ్, అకాంప్లిష్డ్, అకాంప్లిష్డ్+ఎస్, ఎంపవర్డ్+, ఎంపవర్డ్+ఎ అనే అయిదు వేరియంట్లలో అందించబడింది. వేరియంట్ వారీగా కర్వ్ ఈవీలో అందించబడిన ఫీచర్ల పూర్తి వివరాలు వెబ్ సైటులో అందుబాటులో ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే, కర్వ్ ఈవీ కారును వర్చువల్ సన్ రైజ్, ఫ్లేం రెడ్, ఎంపవర్డ్ ఆక్సైడ్, ప్రిస్టిన్ వైట్, మరియు ప్యూర్ గ్రే అనే అయిదు కలర్ల నుంచి మీ నచ్చిన కలర్ లో సెలెక్ట్ చేసుకోవచ్చు.
కర్వ్ ఈవీ ఎక్స్‌టీరియర్ డిజైన్ చాలా అద్బుతంగా ఉంది. కర్వ్ లో అందించబడిన కీలక డిజైన్ అంశాలలో స్ప్లిట్ హెడ్ ల్యాంప్స్, బ్లాంక్డ్-ఆఫ్ గ్రిల్, గ్లోసీ బ్లాక్ క్లాడింగ్ మరియు ఇన్సర్ట్స్, కారు ముందు మరియు వెనుక వైపు ఎల్ఈడీ లైట్ బార్స్, ఎల్ఈడీ టెయిల్ లైట్స్, ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యండిల్స్, మరియు ఏరో ఇన్సర్ట్స్ తో డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ వంటివి ఉన్నాయి. అదే విధంగా మనం కర్వ్ ఈవీలో అందించబడిన ఇంటీరియర్ ఫీచర్ల వివరాలు తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే, ఈ కారులో ఎన్నో కీలకమైన ఫీచర్లను టాటా మోటార్స్ అందించింది. వాటిలో 12.3-ఇంచ్ టచ్‌స్క్రీన్ యూనిట్, ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, వైర్‌లెస్ మొబైల్ ఛార్జర్, ఎడాస్ (ఏడీఏఎస్) సూట్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, జెస్చర్-కంట్రోల్డ్ టెయిల్‌గేట్ మరియు కారు వెనుక సీట్లలో టూ-స్టెప్ రిక్లైన్ ఫంక్షన్ వంటి బెస్ట్ ఫీచర్లు ఉన్నాయి.
2024 కర్వ్ ఎలక్ట్రిక్ కారు 45kWh యూనిట్మరియు 55kWh యూనిట్ అనే రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. అందులో మొదటి బ్యాటరీ ప్యాక్ 502 కిలోమీటర్ల క్లెయిమ్డ్ డ్రైవింగ్ రేంజ్ ని అందిస్తుండగా, రెండవ బ్యాటరీ ప్యాక్ 585కిలోమీటర్ల క్లెయిమ్డ్ డ్రైవింగ్ రేంజ్ ని అందిస్తుంది. దీని పవర్ అవుట్ పుట్ విషయానికి వస్తే, పెద్ద బ్యాటరీ ప్యాక్ ఎలక్ట్రిక్ మోటారుతో జతచేయబడి 165bhp మరియు 215Nm టార్కును ఉత్పత్తి చేస్తుండగా, చిన్న బ్యాటరీ ప్యాక్ సింగిల్ ఎలక్ట్రిక్ మోటారుతో జతచేయబడి 148bhp మరియు 215Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్