- ఇండియాలో రూ. 17.49 లక్షలతో ప్రారంభమైన కర్వ్ ఈవీ ధరలు
- 5 కలర్స్ మరియు 5 వేరియంట్‌లలో లభిస్తున్న మోడల్
టాటా మోటార్స్ అధికారికంగా కర్వ్ ఈవీ బుకింగ్‌లను ఇండియాలో ప్రారంభించింది. ఆసక్తి గల కస్టమర్‌లు ఈ కూపే ఎస్‌యూవీని దీని బ్రాండ్ వెబ్‌సైట్‌లో లేదా దేశవ్యాప్తంగా ఉన్న ఏదైనా అధీకృత డీలర్‌షిప్‌ల వద్ద ఈ రోజు నుండి బుక్ చేసుకోవచ్చు.
దీని ధర రూ. 17.49 లక్షలు (ఎక్స్-షోరూమ్)తో ప్రారంభం కాగా, కొత్త కర్వ్ ఈవీ క్రియేటివ్, అకాంప్లిష్డ్, అకాంప్లిష్డ్+ S, ఎంపవర్డ్+ మరియు ఎంపవర్డ్+ ఎ అనే 5 వేరియంట్‌లలో అందించబడుతుంది. ఇంకా చెప్పాలంటే, కస్టమర్‌లు కర్వ్ ఈవీని ఫ్లేమ్ రెడ్, ఎంపవర్డ్ ఆక్సైడ్, ప్రిస్టీన్ వైట్, ప్యూర్ గ్రే మరియు వర్చువల్ సన్‌రైజ్ వంటి కలర్ ఆప్షన్స్ నుండి ఎంచుకోవచ్చు.
2024 టాటా కర్వ్ ఈవీ రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ తో అందుబాటులోకి రాగా - 45kWh మరియు 55kWh పవర్‌ట్రెయిన్‌లతో లభిస్తుంది. ఇది వరుసగా 148bhp మరియు 165bhp పవర్ అవుట్‌పుట్ ని ఉత్పత్తి చేస్తుంది. అలాగే, 215Nm టార్క్ రెండు బ్యాటరీ ప్యాక్స్ లో సమానంగా ఉత్పత్తి అవుతుంది. ఇందులోని చిన్న యూనిట్ మరియు పెద్ద యూనిట్ బ్యాటరీ ప్యాక్స్ వరుసగా 502కిలోమీటర్ల మరియు 585 కిలోమీటర్ల ఏఆర్ఏఐ- సర్టిఫైడ్ రేంజ్ ని అందిస్తున్నాయి.
ఇప్పటికే కర్వ్ ఈవీని మేము డ్రైవ్ చేసాము, అలాగే డ్రైవ్ చేసిన రివ్యూ మా వెబ్‌సైట్‌లో మరియు కార్‍వాలే యూట్యూబ్ అనే మా ఛానెల్‌లో రేపు, అనగా 13వ తేదీ ఆగస్టు, మధ్యాహ్నం 12గంటలకు అందరికీ అందుబాటులోకి వస్తుంది. మరో విషయం ఏమిటంటే, టాటా మోటార్స్ కర్వ్ ఈవీ టెస్ట్ డ్రైవ్‌లను 14వ తేదీ ఆగస్టు నుండి ప్రారంభం చేయనుంది. మరీ ముఖ్యంగా, కర్వ్ పెట్రోల్ మరియు డీజిల్ డెరివేటివ్‌ల ధరలు సెప్టెంబర్ నెలలో2వ తేదీన ప్రకటించబడతాయి.
అనువాదించిన వారు: రాజపుష్ప