టాటా మోటార్స్ ఈ నెల ప్రారంభంలో ఇండియన్ కార్ మార్కెట్‌లో కర్వ్ కూపే ఎస్‌యువి ఈవీ వెర్షన్‌ను లాంచ్ చేసినప్పటికీ, టాటా కస్టమర్ల నుంచి ఈ కారుకు సందడి మరికొన్ని వారాల వరకు కొనసాగుతుందని భావిస్తున్నాం. ఈ కారుకు సంబంధించి మీరు గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన తేదీలు ఈ కథనంలో ఉన్నాయి.
12ఆగస్టు, 2024
12వ తేదీ ఆగస్టు, టాటా మోటార్స్ ఇండియన్ డీలర్స్ వద్ద కర్వ్ ఈవీ బుకింగ్‌లను ప్రారంభించనుంది. 17.49 లక్షలఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చిన ఈ కారు 5 వేరియంట్లు మరియు 5 కలర్లలో లభిస్తుంది. వీటన్నింటిని మేము మా వెబ్‌సైట్‌లో వివరించాము. అదనంగా, మీరు కారువేరియంట్ వారీ ఫీచర్ల గురించి కూడా చదువుకోవచ్చు.
14 ఆగస్టు, 2024
14వ తేదీ ఆగస్టు, 2024న టాటా కంపెనీ దేశవ్యాప్తంగా ఉన్న డీలర్‌షిప్‌ల వద్ద కర్వ్ ఈవీ టెస్ట్ డ్రైవ్‌లను ప్రారంభించనుంది. ఈ మోడల్ 45kWh మరియు 55kWh అనే రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ తో అందించబడుతుంది. అయితే టెస్ట్ డ్రైవ్స్ టాప్-స్పెక్ 55kWh వెర్షన్‌కు మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
2 సెప్టెంబర్, 2024
ఈ వారం ప్రారంభంలో జరిగిన కార్యక్రమంలో, టాటా మోటార్స్ కర్వ్ ఈవీ డెరివేటివ్ ధరలను మాత్రమే ప్రకటించి మన అందరిని ఆశ్చర్యపరిచింది. అంటే టర్బో-పెట్రోల్, జిడిఐ టర్బో-పెట్రోల్ మరియు డీజిల్ ట్రిమ్ ఐసీఈవెర్షన్ ధరలు వచ్చే నెల ప్రారంభంలో ప్రకటించబడతాయి.ఈ వార్తలను ప్రచురించే సమయంలో ఈ బ్రాండ్ ఐసీఈమరియు ఈవీ వెర్షన్‌ల కోసం డెలివరీ టైమ్‌లైన్‌ను ఇంకా వెల్లడించలేదు.
అనువాదించిన వారు: రాజపుష్ప