- ఈవీ లాంచ్ తర్వాత 3-4 నెలల్లోనే విక్రయించబడనున్న ఐసీఈ వెర్షన్
- భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో ప్రదర్శించబడిన ప్రొడక్షన్-రెడీ కర్వ్ ఐసీఈ
ఇండియా అంతటా ఎంతగానో ఎదురుచూస్తున్న కర్వ్ వెహికిల్ యొక్క అధికారిక లాంచ్ టైంలైన్ వివరాలను టాటా మోటార్స్ వెల్లడించింది. ఆటోమేకర్ ప్రకారం, ఇది ఈవీ మరియు ఐసీఈ వెర్షన్లలో లాంచ్ కానుంది. డీజిల్-పవర్డ్ కర్వ్ ఎస్‍యూవీ లాంచ్ కాగా, దాని తర్వాత మొదటగా ఈవీ వెర్షన్ అరంగేట్రం చేయనుంది.
2025-ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో అనగా జూలై నుండి సెప్టెంబర్-2024 మధ్యలో టాటా కర్వ్ ఈవీ అరంగేట్రం చేయడానికి రంగం సిద్ధమైంది. ఇక, ఐసీఈ వెర్షన్ విషయానికి వస్తే, కర్వ్ ఈవీ లాంచ్ అయిన మూడు నుండి నాలుగు నెలల తర్వాత కార్ మేకర్ దీనిని లాంచ్ చేయనుంది. ఇంకా చెప్పాలంటే, కర్వ్ ఈవీ మరియు ఐసీఈ లాంచ్ తర్వాత మూడవ మోడల్ గా హారియర్ ఈవీ లాంచ్ కానుంది.
ఈ ఇండియన్ ఆటోమేకర్ కర్వ్ ఈవీ కాన్సెప్ట్ ను కొన్ని సంవత్సరాల నుంచి వివిధ సమయాల్లో ప్రదర్శించింది. మొత్తానికి, తాజాగా భారత్ మొబిలిటీ ఎక్స్‌పో-2024లో ప్రొడక్షన్-రెడీ కర్వ్ ఐసీఈని టాటా ప్రదర్శించింది. ఈ మోడల్ కి సంబంధించిన ఇంజిన్ స్పెసిఫికేషన్స్ మరియు డిజైన్ హైలైట్స్ మా కార్‌వాలే వెబ్ సైట్లో అందుబాటులో ఉన్నాయి, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీరు మా వెబ్ సైట్ ని సందర్శించి చదవగలరు.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్