- ఈవీ వెర్షన్ తర్వాత లాంచ్ కానున్న కర్వ్ ఐసీఈ
- పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్లతో అందించబడుతున్న మోడల్
టాటా మోటార్స్ దాని మొట్ట మొదటి కూపే ఎస్‌యువిని వచ్చే నెలలో (ఆగస్టు) ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయనుంది. టాటా కర్వ్ అని పిలువబడి ఈ కూపే ఎస్‌యువి ఐసీఈ మరియు ఈవీ అనే రెండు వెర్షన్స్ లో అందించబడుతుంది. ఇప్పుడు, కర్వ్ ఈవీ బ్యాటరీ ప్యాక్ మరియు రేంజ్ ప్రత్యేక వివరాలు లీకైన అయిన తర్వాత, ఐసీఈ కర్వ్ కి సంబంధించిన ఇంజిన్ మరియు గేర్‌బాక్స్ ఆప్షన్లను కూడా వెల్లడించడానికి ఇది సరైన సమయం అని చెప్పవచ్చు.
మాకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, కర్వ్ ఐసీఈ 1.2-లీటర్ టర్బో-పెట్రోల్, 1.2-లీటర్ జిడిఐ పెట్రోల్ (కొత్తది) మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ అనే మూడు ఇంజిన్ ఆప్షన్లతో అందించబడుతుంది. అలాగే, ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ విషయానికొస్తే, మూడు ఇంజిన్‌లు 6-స్పీడ్ మాన్యువల్ మరియు 7-స్పీడ్ డిసిఎ (డిసిటి) గేర్‌బాక్స్‌తో జత చేయబడి రానున్నాయి. అంతేకాకుండా, ఇతర టాటా ఎస్‌యువిల మాదిరిగానే, కర్వ్ -ఎకో, సిటీ మరియు స్పోర్ట్ అనే మూడు డ్రైవ్ మోడ్‌లను పొందుతుంది.
పవర్ అవుట్‌పుట్ విషయానికి వస్తే, కొత్త 1.2-లీటర్ జిడిఐ మోటార్ 123bhp మరియు 225Nm మాక్సిమం టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. టర్బో-పెట్రోల్ మోటార్ విషయానికొస్తే, నెక్సాన్ నుండి తీసుకోబడిన ఇది 118bhp మరియు 170Nm టార్క్ ఉత్పత్తి చేయడానికి ట్యూన్ చేయబడింది. అదే సమయంలో, డీజిల్ ఇంజిన్ 113bhp మరియు 260Nm టార్క్ ఉత్పత్తి చేయగలదు.
అనువాదించిన వారు: రాజపుష్ప