- రూ.10 లక్షలతో ధరలు ప్రారంభం
- అక్టోబర్ 31వ తేదీ వరకే ప్రారంభ ధర వర్తింపు
ఈ నెలకు ముందుగా కర్వ్ కారును టాటా మోటార్స్ లాంచ్ చేసింది. టాటా నుంచి వచ్చిన ఆల్-న్యూ కూపే ఎస్‍యూవీని బుక్ చేసుకోవడానికి రూ. లక్షల ఎక్స్-షోరూం ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. ఈ ప్రారంభ ధర అక్టోబర్ 31వ తేదీ వరకు బుక్ చేసుకున్న కార్లకు మాత్రమే వర్తిస్తుంది. అంతేకాకుండా, కస్టమర్లు ఎవరైతే ఇప్పటివరకు కర్వ్ ఎస్‍యూవీ కారును బుక్ చేసుకున్నారో వారు కారు డెలివరీని స్వీకరించడం కూడా ప్రారంభమైంది.
టాటా కర్వ్ కారులో అందించబడిన వేరియంట్ల గురించి చెప్పాలంటే, ఈ కారు ప్రస్తుతం స్మార్ట్, ప్యూర్+, ప్యూర్ + ఎస్, క్రియేటివ్, క్రియేటివ్ ఎస్, క్రియేటివ్+ ఎస్, అకాంప్లిష్డ్ ఎస్, అకాంప్లిష్డ్+ ఎ వంటి వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇంకా కలర్ ఆప్షన్ల విషయానికి వస్తే, కర్వ్ కారును గోల్డ్ ఎసెన్స్, ప్రిస్టిన్ వైట్, ప్యూర్ గ్రే, ఫ్లేమ్ రెడ్, డేటోనా గ్రే, మరియు ఒపేరా బ్లూ వంటి ఆరు కలర్లలో పొందవచ్చు.
ఫీచర్ల విషయానికి వస్తే, టాటా కర్వ్ ఎస్‍యూవీలోని టాప్-స్పెక్ వేరియంట్ కారు మూడ్ లైటింగ్ తో భారీ పనోరమిక్ సన్ రూఫ్, వైర్ లెస్ స్మార్ట్ ఫోన్ మిర్రరింగ్ తో 12.3-ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, డిజిటల్ ఇంస్ట్రుమెంట్ ప్యానెల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, పవర్డ్ డ్రైవర్ సీట్, రిక్లైన్ ఫంక్షన్ తో రియర్ సీట్, మరియు వైర్ లెస్ చార్జర్ వంటి ఫీచర్లతో వచ్చింది. అలాగే ఈ కారులో జెస్చర్ కంట్రోల్ తో పవర్డ్ టెయిల్ గేట్, ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యండిల్స్, బ్లైండ్ స్పాట్ మానిటర్ తో 360-డిగ్రీ కెమెరా, మరియు లెవెల్-2 ఎడాస్(ఏడీఏఎస్) సూట్ వంటి బెస్ట్ ఫీచర్లు కూడా అందించబడ్డాయి.
మెకానికల్ గా, ఇండియా-మేడ్ బ్రాండ్ కూపే ఎస్‍యూవీ 1.2-లీటర్ పెట్రోల్, 1.5-లీటర్ హైపీరియన్ టర్బో-పెట్రోల్, మరియు 1.5-లీటర్ క్రయోజెట్ డీజిల్ ఇంజిన్ వంటి మూడు ఇంజిన్ ఆప్షన్లతో వచ్చింది. ఇంకా ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లను పరిశీలిస్తే, ఇందులోని ఇంజిన్లన్నీ 6-స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్పీడ్ డిసిటి గేర్ బాక్సుతో జతచేయబడి వచ్చాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్