- అందుబాటులో ఉన్న ఐసిఇ మరియు ఈవీ వెర్షన్స్
- 2024ప్రారంభంలో మార్కెట్లోకి వచ్చే అవకాశం
టాటా మోటార్స్ దేశంలో చాలా కాలంగా క్రెటా-ప్రత్యర్థి మోడల్ గా పిలిచే కర్వ్ ఎస్‌యువిని టెస్టింగ్ చేస్తుంది. ఇటీవల కర్వ్ ను టెస్ట్ మ్యూల్ లో టెస్టింగ్ చేయడం తరచుగా చూస్తూ ఉన్నాం. అలాగే, ఫొటోస్ లో సరికొత్తగా కనిపిస్తున్న, కూపే ఎస్‌యువి లుక్ చూస్తుంటే దాదాపుగా ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది.
ఫొటోలో చూసినట్లుగా, టాటా కర్వ్ లో ఫ్రంట్ ఫాసియా డిజైన్, నెక్సాన్ ఈవీ- వంటి పూర్తి-లెంగ్త్ ఎల్ఈడీ డిఆర్ఎల్ఎస్, ఇండికేటర్స్ రెట్టింపు స్థాయిని పొందింది. అంతేకాకుండా స్లాట్స్ తో కూడిన 2-లేయర్ గ్రిల్ మరియు హెడ్ ల్యాంప్స్ సెటప్ స్ప్లిట్ బోనెట్ ద్వారా హైలైట్ చేయబడింది.
మరో భాగంలో కర్వ్ చంకీ వీల్ ఆర్చ్‌లతో 17-ఇంచ్ అల్లాయ్ వీల్స్ తో వచ్చే అవకాశం ఉంది. ఇది కూపే లాంటి రూఫ్‌లైన్ రియర్ ప్రొఫైల్‌లో జత చేయబడింది. మరోవైపు మనకు కనిపించే ముఖ్యమైన అంశాలలో ఏ-పిల్లర్ మౌంటెడ్ ఒఆర్‍విఎంఎస్, ఫ్లష్ చేసిన డోర్ హ్యాండిల్స్, షార్క్-ఫిన్ యాంటెన్నా మరియు సీక్వెన్షియల్ ఫంక్షన్‌తో కనెక్ట్ చేయబడిన ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి.
ఇటీవలే వచ్చిన టాటా మోడల్‌ల మాదిరిగానే, కర్వ్ కూడా మోడరన్ మరియు విలాసమైన ఇంటీరియర్ బెనిఫిట్ ని పొందుతుంది. ఇందులో పెద్ద 12.3-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఇల్యూమినేటెడ్ లోగోతో కూడిన ట్విన్-స్పోక్ స్టీరింగ్ వీల్, సెలెక్ట్ కంట్రోల్స్ కోసం ఫిజికల్ స్విచ్‌తో కూడిన టచ్-సెన్సిటివ్ హెచ్ వీఏసీ ప్యానెల్ మరియు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ లను కలిగి ఉంది. వైర్‌లెస్ ఛార్జర్, ఎయిర్ ప్యూరిఫైయర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఆటో-డిమ్మింగ్ ఒఆర్‍విఎంఎస్, 360-డిగ్రీ సరౌండ్ కెమెరా మరియు సన్‌రూఫ్ వంటి ఫీచర్లు కూడా ఆఫర్‌లో ఉన్నాయి.
పవర్‌ట్రెయిన్ విషయానికొస్తే, కర్వ్ ఐసీఈ వెర్షన్ తర్వాత మొదటిసారిగా ఈవీ అవతార్‌లో వస్తుంది. ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించబడిన కొత్త పెట్రోల్ ఇంజిన్‌తో పాటుగా 1.5-లీటర్ డీజిల్ మిల్లుతో వచ్చే అవకాశం ఉంది. ఈ కర్వ్ మోడల్ మార్కెట్లోకి వస్తే, నెక్సాన్ మరియు హారియర్ ఎస్‌యువిల మధ్య సరిగ్గా సరిపోతుంది. ఈ సెగ్మెంట్‌లో కర్వ్ హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, హోండా ఎలివేట్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, ఫోక్స్‌వ్యాగన్ టైగన్, స్కోడా కుషాక్, ఎమ్‌జి ఆస్టర్ మరియు సిట్రోన్ C3 ఎయిర్‌క్రాస్‌లతో పోటీపడుతుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప