- ఆరు ఎక్స్‌టీరియర్ కలర్ ఆప్షన్లలో వస్తున్న కర్వ్
- ఇప్పుడు డ్యూయల్ టోన్ కలర్లలో వస్తున్న అన్ని కలర్లు
టాటా మోటార్స్ మరికొన్ని రోజుల్లో ఇండియాలో దాని మొట్టమొదటి కూపే ఎస్‍యూవీని లాంచ్ చేయనుంది. కరెక్టుగా ఎప్పుడంటే,ఆగస్టు 7వ తేదీన టాటా కర్వ్ లాంచ్ చేయబడుతుంది. కర్వ్ కారును టాటా కంపెనీ రెండు వెర్షన్లలో అందుబాటులోకి తీసుకురానుంది, అవి ఏంటి అంటే, ఐసీఈ వెర్షన్ మరియు ఈవీ వెర్షన్. ఈ రెండింటికి సంబంధించిన పూర్తి వివరాలు మా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ ద్వారా, పెట్రోల్- మరియు డీజిల్-బేస్డ్ కర్వ్ ఎస్‍యూవీలో అందించబడే కలర్ ఆప్షన్ల గురించి, ఇది ఏయే కలర్లలో రాబోతుందో చర్చించబోతున్నాము.
ఐసీఈ వెర్షన్ కర్వ్ కారుప్యూర్ గ్రే, డేటోనా గ్రే, ప్రిస్టిన్ వైట్, కాస్మిక్ గోల్డ్, ఫ్లేమ్ రెడ్ మరియు ఒపెరా బ్లూ అనే ఆరు ప్రైమరీ కలర్లలో అందించబడనుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటి అంటే,ఈ కలర్స్ అన్నీ బ్లాక్ రూఫ్‌తో కూడిన డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్లో కూడా అందుబాటులోకి రాబోతున్నాయి. అదే విధంగా, తర్వాత ఆటోమేకర్ డార్క్ ఎడిషన్‌తో ఒబెరాన్ బ్లాక్ కలర్‌ను కూడా పరిచయం చేయనుంది.
ఫీచర్ల వారీగా చూస్తే, కర్వ్ కారుతొమ్మిది స్పీకర్లతో పెద్ద 12.3-ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 360-డిగ్రీ సరౌండ్ కెమెరా, వైర్‌లెస్ ఛార్జర్, ఎయిర్ ప్యూరిఫైయర్, లెవెల్-2 ఎడాస్(ఏడీఏఎస్) మరియు మూడ్ లైటింగ్‌తో పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్ మరియు మరిన్ని టాప్-ఎండ్ ఫీచర్లతో రానుంది. ఇక్కడ హైలైట్ ఏంటి అంటే, సన్‌రూఫ్ మూడ్ లైటింగ్‌తో రావడం అని చెప్పవచ్చు.
మెకానికల్ గా, కర్వ్ మోడల్ మూడు ఇంజన్ ఆప్షన్లతో వస్తుంది. అవి ఏంటి అంటే, 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్, 1.2-లీటర్ టిజిడిఐ ఇంజిన్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజన్. ఇందులో అందించబడిన అన్ని వెర్షన్లు 6-స్పీడ్ మాన్యువల్ మరియు 7-స్పీడ్ డిసిటి గేర్‌బాక్స్‌తో అందించబడనున్నాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్