- వచ్చే పండుగ సీజన్లో లాంచ్ అయ్యే అవకాశం
- వచ్చే ఏడాది లాంచ్ కానున్న ఐసీఈ వెర్షన్
టాటా మోటార్స్ కొత్త వీడియోలు మరియు చిత్రాల ద్వారా అప్ కమింగ్ (రాబోయే)కర్వ్ ఐసీఈ మరియు ఈవీ వెర్షన్ కార్ల టీజ్ చేయడం ప్రారంభించింది. తాజా టీజర్లో, రెండు కార్లు భారీగా కామోఫ్లేజ్ తో కప్పబడి ఉండగా, విభిన్నమైన పరిస్థితుల్లో టెస్టింగ్ చేయడం మీరు చూడవచ్చు.
ఇది టాటా కర్వ్ ఈవీ యొక్క మొదటి అధికారిక టీజర్ కాగా మరియు దాని ఐసీఈ వెర్షన్ ఇండియాలో దాని లాంచ్‌ను ప్రకటించిన తర్వాత ఫోటో చిత్రీకరించబడింది. కర్వ్ఈవీ ఈ సంవత్సరం ద్వితీయార్థంలో మొదటగా ప్రారంభమవుతుంది, తర్వాత దాని ఐసీఈ వెర్షన్ వచ్చే ఏడాది ప్రారంభంలో వస్తుంది. కొత్త టీజర్లో ఈ రెండు కూపే ఎస్‌యువిలు రాజస్థాన్‌లోని ఎడారి మార్గంలో కఠినమైన పరిస్థితుల్లో టెస్టింగ్ ను కొనసాగిస్తున్నాయి.
ఇక్కడ, కార్లు తీవ్రమైన వేడిలో కొన్ని ఇసుక పాచెస్పై టెస్టింగ్ చేయబడుతున్నాయి, దీని ద్వారా ఎడారి రహదారిపై వాటి సామర్థ్యాలను చూపుతున్నాయి. ముఖ్యంగా, కొత్త యాక్టి ఈవీ ఆర్కిటెక్చర్ అనేది ఫ్రంట్-వీల్, రియర్-వీల్ మరియు ఆల్-వీల్ డ్రైవ్ కాన్ఫిగరేషన్లకు మద్దతు ఇవ్వడానికి పూర్తిగా ఈవీల కోసం అంకితం చేయబడింది.
టాటా మోటార్స్ ఈ రెండు కార్ల స్పెసిఫికేషన్స్ వివరాలను ఇంకా నిర్ధారించలేదు.అయితే, డిజైన్ కాన్సెప్ట్‌లతో చూసినట్లయితే దీనిలో పెద్దగా మార్పులు లేవని తెలుస్తుంది. అలాగే, టాటా కర్వ్ ఈవీ 500కిలోమీటర్ డ్రైవింగ్ రేంజ్‌ని కలిగి ఉండగా, టర్బోచార్జ్డ్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్లలో అందించబడిన ఐసీఈ వెర్షన్ కారు కాంపాక్ట్ ఎస్యువి సెగ్మెంట్లోని హాట్-సెల్లింగ్ కార్లతో పోటీపడుతుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప