- రాబోయే సంవత్సరం అరంగేట్రం చేయనున్న కొత్త ఇంజిన్
- ఆటో ఎక్స్‌పో 2023లో ప్రదర్శించబడిన సఫారీ మరియు హారియర్
టాటా మోటార్స్ భారతదేశంలో హారియర్ మరియు సఫారీ ఫేస్‌లిఫ్ట్‌లను రూ. 15.49 లక్షలు మరియు రూ. 16.19 లక్షలు ప్రత్యేకముగా (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. రెండు ఎస్‌యువిలు వివిధ వేరియంట్ స్థాయిలలో ఏకైక డీజిల్ ఇంజిన్‌తో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఎస్‌యువి డ్యూయో ధరలను వెల్లడిస్తూ, వాహన తయారీదారులు న్యూ టర్బో-పెట్రోల్ మోటార్ ను రాబోయే సంవత్సరంలో తమ ఫ్లాగ్‌షిప్ ఎస్‌యువిలతో రవాణా చేయనున్నట్లు నిర్ధారించారు.
ఢిల్లీలో జరిగిన ఆటో ఎక్స్‌పో 2023లో భారతీయ కార్ల తయారీ సంస్థ 1.5-లీటర్ టి -జిడిఐ 4-సిలిండర్ టర్బో పెట్రోల్ తో కూడిన ఇంజిన్‌ను ప్రదర్శించింది. ఈ టర్బో పెట్రోల్ మోటార్168bhp మరియు 280Nm మాక్సిమమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది . అదే సమయంలో ఈ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ మరియు డిసిటి గేర్‌బాక్స్‌తో జతచేయబడింది.
ప్రస్తుతం, ఫేస్‌లిఫ్టెడ్ హారియర్ మరియు సఫారీలు 2.0-లీటర్ క్రియోటెక్ డీజిల్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ యూనిట్‌తో జతచేయబడి ఉన్నాయి. అదే విధంగా ఇందులోని ఆయిల్ బర్నర్ 168bhp మరియు 350Nm టార్క్ ను ఉత్పత్తి చేసేలా ట్యూన్ చేయబడింది.
ఇతర వార్తలలో చూస్తే, టాటా సఫారి మరియు హారియర్ ఫేస్‌లిఫ్ట్‌లు జిఎన్‍క్యాప్ క్రాష్ టెస్ట్‌లలో పూర్తిగా ఫైవ్-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందాయి.
అనువాదించిన వారు:రాజపుష్ప