- ప్రస్తుతం ఇండియాలో 5 సిఎన్‍జి కార్లను విక్రయిస్తున్న టాటా
- 8 వారాల వరకు అత్యధిక వెయిటింగ్ పీరియడ్ ని కలిగి ఉన్న ఆల్ట్రోజ్ సిఎన్‍జి వేరియంట్స్
టాటా మోటార్స్ ప్రస్తుతం దేశం అంతటా టియాగో, టియాగో ఎన్‌ఆర్‌జి, టిగోర్, పంచ్ మరియు ఆల్ట్రోజ్‌లతో కలిపి మొత్తం 5 సిఎన్‌జి కార్లను విక్రయిస్తోంది. జనవరి 2024లో ఈ వేరియంట్‌లపై ఉన్న వెయిటింగ్ పీరియడ్ వివరాలను ఒకసారి పరిశీలిద్దాం.
ముందుగా టాటా ఆల్ట్రోజ్ సిఎన్‌జితో ప్రారంభిస్తే, హ్యుందాయ్ i20 మరియు మారుతి బాలెనోలకు పోటీగా ఉన్న ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బుకింగ్ చేసిన తేదీ నుండి 8 వారాల వరకు వెయిటింగ్ పీరియడ్‌ను కలిగి ఉంది. అదేవిధంగా, పంచ్ సిఎన్‍జిని బుక్ చేసుకునే కస్టమర్స్ 6 వారాల వరకు వేచి ఉండాల్సి ఉంటుంది.
సిఎన్‌జి రకం టాటా టియాగో సిఎన్‌జి మరియు టిగోర్‌లపై 4 వారాల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంది. ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఈ వెయిటింగ్ పీరియడ్ ముంబై ప్రాంతానికి మాత్రమే వర్తిస్తుందని మీరు గమనించాల్సి ఉంది. ఈ సంవత్సరం తరువాత, టాటాబ్రాండ్ పంచ్ ఈవీ, కర్వ్ ఈవీ, హారియర్ ఈవీ మరియు సఫారి ఈవీ వంటి వివిధ కొత్త ఎలక్ట్రిక్ వెహికిల్స్ విడుదల చేయనుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప