- రూ.2.05 లక్షల మేర తగ్గిన టాటా కార్ల ధరలు
- ఈ ఆఫర్లు 2024 అక్టోబర్ 31వ తేదీ వరకు మాత్రమే
పండుగ సీజన్ ని ఘనంగా ఆరంభించేందుకు టాటా మోటార్స్ దాని పోర్ట్ ఫోలియోలో ఉన్న చాలా వరకు మోడల్స్ పై భారీగా డిస్కౌంట్లను ప్రకటించింది. ఆటోమేకర్ నుంచి వచ్చిన పెట్రోల్, డీజిల్, మరియు సిఎన్‍జి కార్లపై డిస్కౌంట్ ధరలు అందించబడ్డాయి. ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఈ ఆఫర్లు కొద్దిరోజుల వరకే లభిస్తుండగా, 2024 అక్టోబర్ 31వ తేదీన ఆఫర్ల గడువు ముగుస్తుంది.
ముందుగా టాటా మోటార్స్ నుంచి అందుబాటులో ఉన్న బేస్ వేరియంట్ తో ప్రారంభిస్తే, టియాగో కారుపై ధర తగ్గించబడి రూ.5 లక్షలతో వీటి ఎక్స్-షోరూం ధరలు ప్రారంభమయ్యాయి. అదేవిధంగా, అల్ట్రోజ్ కారు రూ.6.5 లక్షల ఎక్స్-షోరూం ధరతో అందుబాటులో ఉంది. ఇంకా ఎస్‍యూవీల విషయానికి వస్తే, నెక్సాన్ కారు ప్రారంభ ధర రూ.8 లక్షల నుంచి మొదలైంది. మరోవైపు, టాటా అందిస్తున్న సబ్సిడీ ధరతో కలిపి ఫ్లాగ్ షిప్ హారియర్ మరియు సఫారీ ఎస్‍యూవీలను వరుసగా, రూ.14.99 లక్షల ఎక్స్-షోరూం ధరతో మరియు రూ.15.49 లక్షల ఎక్స్-షోరూం ధరతో పొందవచ్చు. ఇంకా చెప్పాలంటే, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని షోరూంల వద్ద సెలెక్టెడ్ మోడల్స్ పై రూ.45 వేల వరకు అదనపు బెనిఫిట్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
టాటా కార్లు | ప్రారంభ ఎక్స్-షోరూం ధర | డిస్కౌంట్ (అదనపు బెనిఫిట్లు మినహాయించి) |
టియాగో | రూ.5 లక్షలు | రూ.65,000 |
టిగోర్ | రూ.6 లక్షలు | రూ.30,000 |
అల్ట్రోజ్ | రూ.6.5 లక్షలు | రూ.45,000 |
నెక్సాన్ | రూ.8 లక్షలు | రూ.80,000 |
హారియర్ | రూ.14.99 లక్షలు | రూ.1,60,000 |
సఫారీ | రూ.15.49 లక్షలు | రూ.1,80,000 |
అనువాదించిన వారు: సంజయ్ కుమార్