- ఇండియాలో రూ.6.70 లక్షలతో ప్రారంభంకానున్న అల్ట్రోజ్ ధరలు
- అందుబాటులో ఉన్న 7 కలర్స్ మరియు 9 వేరియంట్స్
అక్టోబరు 2023లో టాటా మోటార్స్ కు సంబంధించిన కార్ల వెయిటింగ్ పీరియడ్ ని మేము కలిగి ఉన్నాము. మా వద్ద పంచ్ మరియు సఫారీతో కలిపి వివిధ మోడల్స్ కి సంబంధించిన పూర్తి టైం లైన్ వివరాలు ఉన్నాయి. ఈ ఆర్టికల్ ను, మీరు జాగ్రత్తగా గమనించి, అల్ట్రోజ్ ప్రీమియం హ్యచ్ బ్యాక్ వెయిటింగ్ డేటాను తెలుసుకోవచ్చు.
అదే విధంగా, కస్టమర్స్ ఎవరైతే సిఎన్‍జి పవర్డ్ టాటా టియాగోను పొందాలనుకున్న వారు బుకింగ్ చేసిన తేది నుంచి 8 వారాల వరకు వేచి ఉండాల్సి వస్తుంది. మరో వైపు, పెట్రోల్ వేరియంట్స్ పై 4 వారాల వరకు వేచి ఉండాల్సి ఉంటుంది. ఈ టైంలైన్ కేవలం ముంబై రీజియన్ కు మాత్రమే వర్తిస్తుంది.
టాటా అల్ట్రోజ్ డీజిల్ టైప్ మీద అత్యధికంగా 6 వారాల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉండనుంది. మరో వైపు, పెట్రోల్ మరియు సిఎన్‍జి వేరియంట్స్ ను ఎంచుకున్న కస్టమర్స్ బుకింగ్ చేసిన తేదీ నుంచి 4 వారాల వరకు వేచి ఉండాల్సి వస్తుంది. ఈ టైంలైన్ కేవలం ముంబై రీజియన్ కు మాత్రమే వర్తిస్తుంది.
ఈ సంవత్సరం జూలైలో, టాటా మోటార్స్ వేరియంట్ లైనప్ లో భాగంగా i20తో పోటీ పడుతున్న 8 వేరియంట్స్ ని అల్ట్రోజ్ నిలిపివేసింది. ఆగస్టు 2023లో దీనిపై రూ.8,000 వరకు ధరను పెంచింది. ప్రస్తుతం ఈ ప్రీమియం హ్యచ్ బ్యాక్ పెట్రోల్, డీజిల్, మరియు సిఎన్‍జి ఇటరేషన్ లో అందించబడుతుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్