- హైదరాబాద్ లో 8 వారాలుగా ఉన్న వెయిటింగ్ పీరియడ్
- టెస్టింగ్ చేస్తూ కనిపించిన ఆల్ట్రోజ్ రేసర్ ఎడిషన్
ఈ నెలలో టాటా కారును కొనాలని ప్లాన్ చేస్తున్నారా ? ఒకవేళ మీరు టాటా ఆల్ట్రోజ్ కొనాలని అనుకుంటే ఈ హ్యచ్ బ్యాక్ లోని డీజిల్ వేరియంట్స్ కు అధిక డిమాండ్ కారణంగా, దీనిని పొందాలంటే 6 వారాల వరకు వేచి ఉండాల్సి ఉంటుంది. ఈ వెయిటింగ్ పీరియడ్ ముంబై రీజియన్ ను మాత్రమే వర్తిస్తుంది. అలాగే హైదరాబాద్ లో ఉన్న కస్టమర్లు దీనిని పొందాలంటే 6 నుండి 8 నెలల వరకు వేచి ఉండాల్సి ఉంటుంది.
అల్ట్రోజ్ పవర్డ్ 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్స్ తో అందుబాటులో ఉంది. ఇంతకు ముందున్నది నేచురల్లీ ఆస్పిరేటెడ్ మరియు టర్బో రకాలలో 85bhp మరియు 108bhp టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అదే విధంగా, డీజిల్ మిల్ 89bhp మరియు 200Nmటార్క్ ఉత్పత్తి చేస్తుంది. బిఎస్6 ఫేజ్ 2కు అనుగుణంగా తయారైన ఇంజిన్స్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ జత చేయబడి ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే, పెట్రోల్ ఇంజిన్ ను 6-స్పీడ్ ఆటోమేటెడ్ ట్రాన్స్‌మిషన్ తో కూడా పొందవచ్చు.
దీని గురించి ఇంకా చెప్పాలంటే, నవంబర్ నెలలో టాటా మోటార్స్ రూ.35,000వరకు డిస్కౌంట్స్ అందిస్తుంది. కస్టమర్స్ వీటిని క్యాష్ డిస్కౌంట్స్, కార్పోరేట్ డిస్కౌంట్స్, మరియు ఎక్స్చేంజ్ బోనస్ రూపంలో పొందవచ్చు.
ప్రస్తుతం, ఈ ఇండియన్ కార్ మేకర్ అల్ట్రోజ్ యొక్క రేసర్ వెర్షన్ ను టెస్టింగ్ చేస్తూ ఉంది. దీనిని ఆటో ఎక్స్ పో-2023లో ప్రదర్శించగా, ఒకవేళ లాంచ్ అయితే, ఈ హ్యచ్‍బ్యాక్ యొక్క స్పెషల్ ఎడిషన్ లో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, పెద్ద 10.25-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్ వంటి ఫీచర్స్ ఉండనున్నాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్