- ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో విక్రయించబడుతున్న స్పోర్టియర్ ఆల్ట్రోజ్
- మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లో మాత్రమే అందుబాటులో ఉన్న ఆల్ట్రోజ్ రేసర్
టాటా మోటార్స్ ఆల్ట్రోజ్ రేసర్‌ను మరింత అదనపు ఫీచర్లు మరియు కాస్మెటిక్ మార్పులతో లాంచ్ చేసింది.ఇది నెక్సాన్‌లో ఉన్న 1.2-లీటర్ మూడు-సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ ని పొందింది. తర్వాత నెక్సాన్ 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ (డిసిఎ) ట్రాన్స్‌మిషన్‌ను పొందింది. అలాగే, ఆల్ట్రోజ్ రేసర్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ను మాత్రమే పొందగా, ఈహ్యాచ్‌బ్యాక్ రేసియర్ వెర్షన్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను ఎందుకు పొందాలో ఇక్కడ మనం తెలుసుకుందాం.
సౌకర్యం మరియు సేఫ్టీ
డిసిఎ తో క్లచ్-లెస్ షిఫ్ట్‌లను పరిచయం చేయగా, డ్రైవర్ తన ఎడమ కాలుతో చేసే ప్రయత్నాలను(ఆపుతుంది) శ్రమను తగ్గిస్తుంది. అలాగే, ఎక్కువ గేర్మార్పులు లేకుండా మరియు స్టీరింగ్‌పై రెండు చేతులతో, డ్రైవర్ డ్రైవింగ్‌పై మెరుగ్గా దృష్టి పెట్టగలడు.
ఎలిమినేట్ నెగెటివ్స్
ఆల్ట్రోజ్ రేసర్ పెడల్ వద్ద వేగవంతమైన చర్యతో కొత్త క్లచ్‌ను పొందినప్పటికీ, గేర్ మార్పులు కొనసాగుతున్నాయి.ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కారు ఈ పెద్ద సమస్యను తొలగిస్తుంది.
లభ్యత
7-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఇప్పటికే నెక్సాన్ లో అందుబాటులో ఉంది కాబట్టి, ఆల్ట్రోజ్ లో కూడా కార్‌మేకర్ దీనిని తీసుకురావడం పెద్ద కష్టమేం కాదు . అలాగే, ఆల్ట్రోజ్ రేసర్ నెక్సాన్ లో ఉన్న పవర్‌ట్రెయిన్‌ని పోలి ఉండగా, ఈ డిసిఎ ని కూడా ఇందులో చేర్చింది.
ప్రీమియం మోడల్ గా అందించబడిన ఆల్ట్రోజ్ రేసర్
ఆల్ట్రోజ్ రేసర్ ఎంట్రీ లెవల్ కారు కాదు, ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు. అందువల్ల, రూ. 10 లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేసే కస్టమర్‌లు గేర్‌షిఫ్టింగ్ వంటి విషయాలలోకాబట్టి ఈ డిసిఎ కంఫర్ట్‌తో పాటు, గేర్‌షిఫ్టింగ్ వంటి వాటిలో సౌకర్యవంతమైన అనుభూతిని కూడా కోరుకుంటారు.అందువల్ల, ఆ కొనుగోలుదారుల డిమాండ్‌ను కూడా కంపెనీ చూసుకోవడం అవసరం.
పోటీదారులకు గట్టి పోటీని ఇవ్వగలదు
ఈ టాటాఆల్ట్రోజ్ తో పోటీ గురించి మాట్లాడినప్పుడు, హ్యుందాయ్ i20 N లైన్ పేరు మొదట వస్తుంది. ఈ హ్యుందాయ్ కారు ఆటోమేటిక్ మరియు మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లతో అందుబాటులో ఉంది. ధరల విషయానికొస్తే, ఆల్ట్రోజ్రేసర్ ధర హ్యుందాయ్ కంటే తక్కువగా ఉంది.అలాగే,ఈ రెండు కార్లుకూడా ఒకదానితో ఒకటి గట్టి పోటీపడతాయి
అనువాదించిన వారు: రాజపుష్ప