పరిచయం
ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ హ్యచ్ బ్యాక్స్ ఉండగా, ఇప్పుడు వాటికి పోటీగా టాటా ఆల్ట్రోజ్ రేసర్ కూడా వచ్చి చేరింది. ఈ ప్రీమియం హ్యచ్ బ్యాక్ హై-పెర్ఫార్మెన్స్ వెర్షన్ లో అందించబడగా, ఇది ఆల్ట్రోజ్ కారులో కొత్త టాప్-స్పెక్ మోడల్ గా వచ్చింది. ఆల్ట్రోజ్ రేసర్ ధరలు రూ. 9.49 లక్షలతో ప్రారంభం కాగా, దీనిని మూడు వేరియంట్లలో మూడు కలర్లలో పొందవచ్చు.
టాటా నుంచి వచ్చిన ప్రోడక్ట్ స్ట్రాంగ్ గా కనిపిస్తుండగా, హ్యుందాయ్ i20 N లైన్ తో పోటీపడాలంటే దీనికి ఎన్నో మెరుగైన అప్ డేట్స్ అందించాల్సి ఉంది. ఈ రెండు కార్లు ఏయే అంశాలలో పోటీపడుతున్నాయో ఈ ఆర్టికల్ ద్వారా మనం ఒకసారి పరిశీలిద్దాం.
డిజైన్ హైలైట్స్
ఈ రెండు కార్లు ఒకే రూట్ లో రాగా, బయటి వైపుగా మనకు కనిపించే కారు లుక్ ని చూస్తే, డ్యూయల్-టోన్ కలర్లు, బ్యాడ్జింగ్ మరియు బయటిపైపు ఆల్ట్రోజ్ ఫాస్టర్ లుక్ ఉంది. సిల్హౌట్ మరియు బేసిక్ డిజైన్ పరంగా, ఇవి ఒకే షేప్ ని కలిగి ఉండగా, ఈ రెండూ ఒకే బ్రాండ్ నుంచి వచ్చినట్లుగా అనిపిస్తాయి. i20 కలర్లతో పోలిస్తే ఆల్ట్రోజ్ మెరుగైన కలర్లతో వచ్చింది. కానీ i20 N లైన్ మెరుగైన డిజైన్ అంశాలను కలిగి ఉంది ఆల్ట్రోజ్ రేసర్ కంటే మెరుగ్గా కనిపిస్తుంది.
ఫీచర్ లిస్టు
ఆల్ట్రోజ్ రేసర్ మరియు i20 N లైన్ ఈ రెండూ ఒకే సెగ్మెంట్లో పోటీని ఎదుర్కొంటుండగా, ఈ రెండు మోడళ్లలో 360-డిగ్రీ కెమెరా, పెద్ద టచ్‌స్క్రీన్, కస్టమైజ్ డిజిటల్ క్లస్టర్, సన్‌రూఫ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ మరియు వైర్‌లెస్ ఛార్జర్ వంటివి ఫీచర్లు ఉన్నాయి. వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు మరియు పెద్ద టచ్‌స్క్రీన్ సిస్టమ్ ద్వారా రేసర్ i20 N లైన్ కంటే మెరుగైన ఫీచర్లు కలిగి ఉంది. అలాగే, ఈ రెండు కార్లు 6 ఎయిర్‌బ్యాగ్స్, ఈబీడీతో కూడిన ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్, మిడిల్-రియర్ ఆక్యుపెంట్స్ కోసం హెడ్‌రెస్ట్‌లు మరియు హైలైన్ టిపిఎంఎస్ వంటి ఫీచర్లతో ఒకే రకమైన ఫీచర్లను కలిగి ఉన్నాయి.
ఇంజిన్ మరియు స్పెసిఫికేషన్స్
వీటి పెర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే ముందుగా, ఆల్ట్రోజ్ రేసర్ నెక్సాన్-బేస్డ్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో రాగా, ఈ ఇంజిన్ 118bhp/170Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. అలాగే i20 N లైన్ కారు 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ తో రాగా, ఈ ఇంజిన్ 118bhp/172Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండింటిలో 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ స్టాండర్డ్ గా రాగా, వీటికి అదనంగా, i20 N లైన్ కారు 7-స్పీడ్ డిసిటి గేర్ బాక్సుతో వచ్చింది. నెక్సాన్ లో వచ్చిన తర్వాత, ఆల్ట్రోజ్ రేసర్ లో కూడా టాటా కంపెనీ 7-స్పీడ్ డిసిటి గేర్ బాక్సును అందించవచ్చని మేము భావిస్తున్నాం.
ధర
ఆల్ట్రోజ్ రేంజ్ (ఎంటి మాత్రమే) ఎక్స్-షోరూం ధరలు రూ. 9.49 లక్షల నుంచి ప్రారంభం కాగా, ఇందులో టాప్-వేరియంట్ ఎక్స్-షోరూం ధర రూ.10.49 లక్షలుగా ఉంది. అదే విధంగా i20 N లైన్ కారు వేరియంట్ ధరలలో సుమారు రూ. 50 వేల నుంచి రూ. 80 వేల వరకు తేడా ఉండగా, ఇవి ఎంటి వేరియంట్లపై మాత్రమే వర్తిస్తాయి. ఈ సంవత్సరం చివరలో ఆల్ట్రోజ్ రేసర్ 7-స్పీడ్ డిసిటి గేర్ బాక్సును పొందిన తర్వాత వీటి ధరలు తగ్గవచ్చని మేము భావిస్తున్నాం.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్