- 118bhp- టార్క్‌ని ఉత్పత్తి చేసే, 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ తో అందించబడుతున్నమోడల్
- అందుబాటులో ఉన్న 3 కలర్స్ మరియు3 వేరియంట్స్
టాటా మోటార్స్ ఆల్ట్రోజ్ రేసర్ వేరియంట్‌ల ధరలు రేపే, (అనగా) జూన్ 7వ తేదీన ఇండియాలోప్రకటించడానికి సిద్ధంగా ఉంది.ఈ బ్రాండ్ నుంచి వచ్చిన ప్రీమియం హాచ్ యొక్క స్పోర్టియర్ ఇటరేషన్ 3 వేరియంట్స్ లో మరియు 3 కలర్స్ లో అందించబడుతుంది.
బానెట్ కింద, న్యూ ఆల్ట్రోజ్ రేసర్ 1.2-లీటర్, 3-సిలిండర్, టర్బో-పెట్రోల్ ఇంజిన్ తో వస్తుంది. , ఇంతకు ముందుఈ మోటారు ఆల్ట్రోజ్ రేంజ్ లో ఐ-టర్బోరకంలో అందించబడినప్పటికీ, ఇప్పుడు ఈరేసర్ డెరివేటివ్ 118bhp మరియు 170Nm మాక్సిమం టార్క్ ని ఉత్పత్తి చేయగలదు.ఈ మోటార్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ద్వారా (ముందు) ఫ్రంట్ వీల్స్ కి పవర్ ని సప్లై చేస్తుంది.
2024 టాటా ఆల్ట్రోజ్ రేసర్ ఇంటీరియర్ హైలైట్స్ లో డ్యూయల్-టోన్పెయింట్, ఫ్రంట్ ఫెండర్‌లపై రేసర్ బ్యాడ్జింగ్, డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, బ్లాక్ బానెట్ మరియు మధ్యలో ఉన్న రెండింటి మధ్యతెల్లని చారలతో కూడిన బోనెట్ మరియు రూఫ్, మరియు ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ వంటివి ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే, కస్టమర్‌లు దీనిని అటామిక్ ఆరెంజ్, అవెన్యూ వైట్ మరియు ప్యూర్ గ్రే అనే 3 కలర్స్ నుండి R1, R2 మరియు R3 అనే 3 వేరియంట్స్ నుండి ఎంచుకోవచ్చు.
లోపలి భాగంలో, ఆల్ట్రోజ్ రేసర్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, న్యూ 10.25-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆరెంజ్ యాక్సెంట్స్ మరియు యాంబియంట్ లైటింగ్, ఆరెంజ్ మరియు వైట్ స్ట్రిప్స్‌తో కూడిన ఆల్-బ్లాక్ అప్హోల్స్టరీ, హెడ్‌రెస్ట్‌లపై రేసర్ లెటర్రింగ్, 360- డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్స్ మరియు వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప