- మూడు వేరియంట్లలో అందించబడనున్న ఆల్ట్రోజ్ రేసర్
- ఇందులో కేవలం మాన్యువల్ గేర్ బాక్సును మాత్రమే అందించిన టాటా
మొత్తానికి త్వరలో రానున్న అప్‍కమింగ్ (రాబోయే) ఆల్ట్రోజ్ రేసర్ లాంచ్ తేదీని టాటా మోటార్స్ ప్రకటించింది. పెర్ఫార్మెన్స్-బేస్డ్ హ్యచ్ బ్యాక్ కారు ధరలను 7 జూన్, 2024న టాటా రిలీజ్ చేయనుండగా, ఆ ఈవెంట్ కంటే ముందుగా ఈ స్పోర్ట్ లుక్ తో వస్తున్న ఆల్ట్రోజ్ రేసర్ మోడల్ యొక్క వేరియంట్లు, పవర్ ట్రెయిన్, కలర్ ఆప్షన్లు, మరియు ఫీచర్లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మేము కలిగి ఉన్నాము.
హ్యుందాయ్ i20 N లైన్ తో పోటీపడుతున్న ఈ మోడల్ ని మొత్తం R1, R2, మరియు R3 అనే మూడు వేరియంట్లలో టాటా విక్రయించనుంది. కలర్ ఆప్షన్ల పరంగా, కస్టమర్లు దీనిని అటామిక్ ఆరెంజ్, అవెన్యూ వైట్, మరియు ప్యూర్ గ్రే అనే మూడు ఎక్స్‌టీరియర్ కలర్ల నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే, ఈ మోడల్ పై ఆసక్తికలిగిన వినియోగదారులు దీనిని కేవలం రూ.21,000 టోకెన్ అమౌంట్ ని చెల్లించి బుక్ చేసుకోవచ్చు.
పవర్ ట్రెయిన్ మరియు స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే, ఆల్ట్రోజ్ రేసర్ నెక్సాన్ లో అందించబడిన 1.2-లీటర్ టర్బో ఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ తో వస్తుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్సుతో జతచేయబడి 118bhp మరియు 170Nm మాక్సిమం టార్కును ఉత్పత్తి చేస్తుంది. పైన పేర్కొన్న దీనికి పోటీగా ఉన్న మోడల్ లాగే ఆల్ట్రోజ్ రేసర్ కూడా డిసిటి గేర్ బాక్సును పొందవచ్చని మేము భావిస్తున్నాం. మొత్తానికి ఇండియన్ ఆటోమేకర్ ఆల్ట్రోజ్ రేసర్ లో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ని మిస్ చేసింది.
ఫీచర్ల పరంగా, ఆల్ట్రోజ్ రేసర్ భారీ 10.25-ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, డిజిటల్ ఇంస్ట్రుమెంట్ ప్యానెల్, వైర్‌లెస్ ఛార్జర్, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎయిర్ ప్యూరిఫైయర్ మరియు యాంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్లతో రానుంది. అలాగే ఈ మోడల్ 360-డిగ్రీ సరౌండ్ కెమెరా, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, బ్లైండ్ స్పాట్ మానిటర్ మరియు ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సింగిల్-పేన్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లతో కూడా అందించబడే అవకాశం ఉంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్