- టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో రానున్న కొత్త మోడల్
- జూన్ నెల మధ్యలో లాంచ్ అయ్యే అవకాశం
టాటా మోటార్స్ ఇండియాలో లాంచ్ కానున్న ఆల్ట్రోజ్ రేసర్‌ను అధికారికంగా టీజ్ చేసింది. ఈ పెర్ఫార్మెన్స్ హ్యాచ్‌బ్యాక్ జూన్ నెల మధ్యలో ఇండియన్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే, హ్యుందాయ్ i20 N లైన్ కు పోటీగా ఉన్న ఈ మోడల్ యొక్క పవర్‌ట్రెయిన్ మరియు ఫీచర్లతో సహా చాలా వివరాలు మాకు ఇప్పటికే తెలుసు. ఇప్పుడు, రానున్న రోజుల్లో టాటా ఆల్ట్రోజ్ రేసర్ బుకింగ్‌లు ప్రారంభమవుతాయని మేము భావిస్తున్నాము.
టాటా ఆల్ట్రోజ్ రేసర్ లో అతిపెద్ద హైలైట్ ఏంటి అంటే, ఇది వివిధ పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ తో వస్తుంది.హ్యాచ్‌బ్యాక్ 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడిన 1.2-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో అందుబాటులోకి రానుంది. ఈ ఇంజిన్ 118bhp మరియు 170Nm మాక్సిమం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది, దీని ఇంజిన్ హ్యుందాయ్ i20 N లైన్ లో ఉన్న 1.0-లీటర్ టర్బో ఇంజిన్‌తో సమానంగా ఉంటుంది.
ఈ మోడల్ ఆటో ఎక్స్‌పో 2023 మరియు భారత్ మొబిలిటీ షో 2024లో ప్రదర్శించబడింది.ఫీచర్ల విషయానికొస్తే, ఇది పెద్ద 10.25-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, మల్టిపుల్ డ్రైవ్ మోడ్స్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఛార్జర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్ మరియు ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల సన్‌రూఫ్ వంటి ఫీచర్ల తో లోడ్ అవుతుంది.
ఇది స్టాండర్డ్ ఆల్ట్రోజ్ నుండి వేరుగా కనిపించేందుకు , రేసర్ ఎడిషన్ బ్లాక్-అవుట్ హుడ్, రూఫ్, ఒఆర్‍విఎంఎస్, పిల్లర్స్ మరియు అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంటుంది. ఇంకా, రూఫ్ మరియు హుడ్ హ్యాచ్‌బ్యాక్ స్పోర్టీ లుక్‌ను మరింత మెరుగుపరిచేందుకు తెల్లని చారలతో కూడిన పైకప్పు స్ట్రిప్స్‌ను కలిగి ఉంది. లాంచ్ కానున్న ఆల్ట్రోజ్ రేసర్ క్యాబిన్ కూడా వైట్ కలర్ తో బ్లాక్మరియు రెడ్ కలర్ థీమ్‌ను కలిగి ఉండనుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప