ఇండియా దిగ్గజ బ్రాండ్ టాటా మోటార్స్ ఆల్ట్రోజ్ రేసర్ అనే కొత్త మోడల్ ని ఇండియాలో రూ. 9.49 లక్షల ఎక్స్-షోరూం ప్రారంభ ధరతో అధికారికంగా లాంచ్ చేసింది. హ్యుందాయ్ i20 N లైన్ తో పోటీ పడుతున్న ఈ ప్రీమియం హ్యచ్ బ్యాక్ స్పోర్టియర్ ఇటరేషన్ ని కార్ మేకర్ యొక్క అధికారిక వెబ్ సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.
2024ఆల్ట్రోజ్ రేసర్ లో 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ కేవలం 1.2-లీటర్, 3-సిలిండర్, టర్బో-పెట్రోల్ ఇంజిన్ తో మాత్రమే జతచేయబడి వచ్చింది. నెక్సాన్ ఆధారంగా వచ్చిన ఈ ఇంజిన్ 118bhp మరియు 170Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది.
కలర్స్ పరంగా, కొత్త ఆల్ట్రోజ్ రేసర్ ని అటామిక్ ఆరెంజ్, అవెన్యూ వైట్, మరియు ప్యూర్ గ్రే అనే మూడు కలర్లలో అందుబాటులోకి వచ్చింది. ఇంకా చెప్పాలంటే, కస్టమర్లు ఈ మోడల్ ని R1, R2, మరియు R3 అనే మూడు వేరియంట్ల నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. వేరియంట్-వారీగా టాటా ఆల్ట్రోజ్ రేసర్ ఫీచర్లు కింది విధంగా ఉన్నాయి.
ఆల్ట్రోజ్ రేసర్ R1 16-ఇంచ్ అల్లాయ్ వీల్స్ 6 ఎయిర్‌బ్యాగ్స్ లెదరెట్ సీట్లు 10.25-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ పుష్ బటన్ స్టార్ట్-స్టాప్‌తో స్మార్ట్ కీ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ రియర్ వైపర్ మరియు వాషర్ నాలుగు స్పీకర్లు మరియు నాలుగు ట్వీటర్లు ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ రియర్ డీఫాగర్ నాలుగు పవర్ విండోలు ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ మరియు ఫోల్డబుల్ ఓఆర్‍విఎం క్రూయిజ్ కంట్రోల్ హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు రియర్ ఏసీవెంట్స్ ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్ లెదర్ తో చుట్టబడిన ఫ్రంట్ స్లైడింగ్ ఆర్మ్‌రెస్ట్ స్పోర్టి ఎగ్జాస్ట్ లెదర్ తో చుట్టబడిన స్టీరింగ్ వీల్ మరియు గేర్ నాబ్ డాష్‌బోర్డ్‌పై యాంబియంట్ లైటింగ్ |
ఆల్ట్రోజ్ రేసర్ R2 వాయిస్-యాక్టివేటెడ్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ వైర్ లెస్ ఛార్జర్ 7-ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ 360-డిగ్రీ కెమెరా (సరౌండ్ వ్యూ సిస్టమ్) బ్లైండ్ స్పాట్ మానిటర్ ఎక్స్‌ప్రెస్ కూల్ ఫంక్షన్ |
ఆల్ట్రోజ్ రేసర్ R3 ఎయిర్ ప్యూరిఫైయర్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్ iRA కనెక్టెడ్ కార్ టెక్నాలజీ |
అనువాదించిన వారు: సంజయ్ కుమార్