- మూడు వేరియంట్లలో లభ్యం
- ఈ నెల ప్రారంభంలో మొదలైన వీటి బుకింగ్స్
దేశమంతటా ఎంతగానో ఎదురుచూస్తున్న, నేటి రోజుల్లో దేశవ్యాప్తంగా ఎంతగానో చర్చిస్తున్న ఆల్ట్రోజ్ రేసర్ స్పోర్టియర్ ఇటరేషన్ ని టాటా మోటార్స్ నేడే ఇండియాలో లాంచ్ చేసింది. పెర్ఫార్మెన్స్ హ్యచ్ బ్యాక్ మూడు వేరియంట్లలో రూ. 9.49 లక్షల ఎక్స్ –షోరూం ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చింది.
టాటా ఆల్ట్రోజ్ రేసర్ ని మొత్తం అటామిక్ ఆరెంజ్, అవెన్యూ వైట్ మరియు ప్యూర్ గ్రే అనే మూడు కలర్లలోR1, R2, మరియు R3 వేరియంట్లలో పొందవచ్చు. డిజైన్ పరంగా చెప్పాలంటే, రేసర్ మోడల్ బ్లాక్డ్-అవుట్ రూఫ్ మరియు బానెట్ పై డ్యూయల్-టోన్ పెయింట్ స్కీమ్ తో రాగా, హుడ్ మరియు రూఫ్ పై తెల్లని చారలు (వైట్ స్ట్రిప్స్), బ్లాక్డ్-అవుట్ ఆల్ట్రోజ్ బ్యాడ్జింగ్, డార్క్-థీమ్డ్ అల్లాయ్ వీల్స్, మరియు దీని బాడీ స్టాండర్డ్ ఆల్ట్రోజ్ కంటే వేరుగా కనిపించేందుకు రేసర్ బ్యాడ్జీలు వంటివి ఉన్నాయి.
స్పోర్టీ థీమ్ కారు లోపల కూడా కనిపిస్తుండగా, కారు లోపల బ్లాక్డ్-అవుట్ క్యాబిన్ మరియు ఎయిర్ కాన్ వెంట్స్ పై రెడ్ యాక్సెంట్స్, సెంటర్ కన్సోల్, మరియు సీట్ అప్హోల్స్టరీ వంటివి ఉన్నాయి. ఫీచర్ల పరంగా, టాటా ఆల్ట్రోజ్ రేసర్ పెద్ద 10.25-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్‌ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 7-ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, బ్లైండ్ స్పాట్ మానిటర్‌తో కూడిన 360-డిగ్రీ సరౌండ్ కెమెరా, ఎయిర్ ప్యూరిఫైయర్, యాంబియంట్ లైటింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు మరియు ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సన్ రూఫ్ వంటి ఫీచర్లతో వచ్చింది.
బానెట్ కింద, ఆల్ట్రోజ్ రేసర్ 1.2-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ మోటార్ కేవలం 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్సుతో మాత్రమే జతచేయబడి వచ్చింది. నెక్సాన్ ఆధారంగా వచ్చిన దీని ఇంజిన్ 118bhp మరియు 170Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఈ టైప్ లో చూస్తే, పెర్ఫార్మెన్స్ హ్యచ్ బ్యాక్ సెగ్మెంట్లో ఆల్ట్రోజ్ రేసర్ హ్యుందాయ్ i20 N లైన్ తో పోటీపడుతుంది.
వేరియంట్-వారీగా టాటా ఆల్ట్రోజ్ రేసర్ ఎక్స్-షోరూం ధరలు కింది విధంగా ఉన్నాయి:
టాటా ఆల్ట్రోజ్ రేసర్ R1 – రూ. 9.49 లక్షలు
టాటా ఆల్ట్రోజ్ రేసర్ R2 – రూ.10.49 లక్షలు
టాటా ఆల్ట్రోజ్ రేసర్ R3 – రూ. 10.99 లక్షలు
అనువాదించిన వారు : సంజయ్ కుమార్