- 2023 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించబడిన ఆల్ట్రోజ్ రేసర్
- త్వరలో లాంచ్ అవుతుందని అంచనా
టాటా మోటార్స్ ఆల్ట్రోజ్ హ్యాచ్‌బ్యాక్ యొక్క స్పోర్టియర్ ఇటరేషన్ ని లాంచ్ కు ముందే టెస్టింగ్ కొనసాగిస్తుండగా, ఇది త్వరలో లాంచ్ కానుంది. వెబ్‌లో షేర్ చేసిన స్పై షాట్‌లలో ఆల్ట్రోజ్ రేసర్ కొత్త లుక్ తో కనిపించింది, ఈ వెర్షన్ 2023లో ఆటో ఎక్స్‌పోలో మొదటిసారి ప్రదర్శించబడింది.
ఇక్కడ చిత్రాలలో చూసినట్లుగా, టాటా ఆల్ట్రోజ్ రేసర్ టెస్ట్ మ్యూల్ వైట్ కవర్ తో కప్పి ఉండగా, పైకప్పును మినహాయించి చాలా వరకు అస్పష్టంగా ఉంది. ముఖ్యంగా ఇది స్టాండర్డ్ ఆల్ట్రోజ్ నుండి వేరుగా కనిపించడానికి వెనుకవైపు ట్విన్-టిప్ ఎగ్జాస్ట్ సెటప్ కలిగి ఉంది.
బయటి భాగంలో, కొత్త ఆల్ట్రోజ్ రేసర్ బ్లాక్ బానెట్ మరియు మధ్యలో ఉన్న రెండింటి మధ్య తెల్లని చారలతో కూడిన పైకప్పు, కొత్త అల్లాయ్ వీల్స్ మరియు ‘రేసర్’ బ్యాడ్జింగ్ ద్వారా సాధారణ వెర్షన్ నుండి వేరుగా కనిపిస్తుంది.
లోపల భాగంలో, ఈ మోడల్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, వైర్‌లెస్ ఛార్జింగ్, హెచ్‌యుడి, 7 ఇంచ్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 360-డిగ్రీ కెమెరా, ఫ్రంట్ హెడ్‌రెస్ట్‌లపై 'రేసర్' ఎంబాసింగ్ మరియు వెనుక ఏసీ వెంట్స్ తో వచ్చే అవకాశం ఉంది.
క్రింది హుడ్ లో, 2024 ఆల్ట్రోజ్ రేసర్ 1.2-లీటర్, టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుందని భావిస్తుండగా, ఇది 118bhp మరియు 170Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇందులో ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌కు మాత్రమే పరిమితం చేయబడ్డాయి.
అనువాదించిన వారు: రాజపుష్ప