- ఈ నెలాఖరులో ఆల్ట్రోజ్ రేసర్ లాంచ్
- మూడు వేరియంట్లు మరియు తొమ్మిది కలర్లలో అందించబడుతున్న ఆల్ట్రోజ్ రేసర్
టాటా మోటార్స్ దాని ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ పెర్ఫార్మెన్స్-ఓరియంటెడ్ వెర్షన్‌ను పరిచయం చేయడానికి అన్నీ ఏర్పాట్లు చేస్తుంది. ఇండియాలో ఆల్ట్రోజ్ రేసర్ గా పిలువబడుతున్న ఈ మోడల్ ఈ నెలాఖరులోగా లాంచ్ చేయబడనుంది. ప్రస్తుతానికైతే, దీని ధరలు ఇంకా వెల్లడి కాలేదు. కానీ, ఆటోమేకర్ హ్యుందాయ్ i20 N లైన్-తో పోటీగా ఉన్న దీని బుకింగ్స్ ప్రారంభించింది.
టాటా రిలీజ్ చేసిన టీజర్ వీడియోలో చూసినట్లుగా, కొత్త టాటా ఆల్ట్రోజ్ రేసర్ డ్యూయల్-టోన్ పెయింట్ థీమ్‌ను పొందనుంది, ఇక్కడ కారు టాప్ సెక్షన్ బ్లాక్ ఫినిషింగ్ మరియు లోయర్ సెక్షన్ ఆరెంజ్ ఫినిషింగ్‌ను పొందుతుంది. రెండవది లాంచ్ సమయానికి మూడు ఆప్షన్లలో అందుబాటులోకి రానుండగా, వాటి వివరాలు ప్రస్తుతం మా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. బానెట్ బ్లాక్ ఫినిషింగ్‌ను పొందగా, బానెట్ మీదుగా డ్యూయల్ వైట్ స్ట్రిప్స్ రూఫ్ వరకు ఉన్నాయి.
వీడియో ప్రకారం చూస్తే, 2024 ఆల్ట్రోజ్ రేసర్ ఇంటీరియర్ పరంగా లోపలి భాగంలో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఆల్-బ్లాక్ ఇంటీరియర్ థీమ్, డిజిటల్ ఇంస్ట్రుమెంట్ కన్సోల్, ఆరెంజ్ ఇన్సర్ట్స్ మరియు యాంబియంట్ లైటింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఆరెంజ్ స్టిచింగ్, కొత్త 10.25-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, మరియు ఎయిర్ ప్యూరిఫైయర్ వంటి ఫీచర్లను పొందనుంది.
బానెట్ కింద, హ్యుందాయ్ i20 N లైన్ కి పోటీగా ఆల్ట్రోజ్ రేసర్ 1.2-లీటర్, రెవోట్రాన్ టర్బో-పెట్రోల్ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే జత చేయబడి రానుంది. ఈ మోటార్ 118bhp మరియు 170Nm టార్కును ఉత్పత్తి చేసేలా ట్యూన్ చేయబడింది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్