- రూ.9.49 లక్షల ఎక్స్-షోరూం ధరతో లాంచ్ అయిన స్పోర్ట్ లుక్ మోడల్
- కేవలం మాన్యువల్ గేర్ బాక్సుతో మాత్రమే అందించబడిన ఆల్ట్రోజ్ రేసర్
టాటా మోటార్స్ తాజాగా ఆల్ట్రోజ్ రేసర్ అనే కొత్త పెర్ఫార్మెన్స్ హ్యచ్ బ్యాక్ ని ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. హ్యుందాయ్ i20 N లైన్ తో పోటీ పడుతున్న ఈ మోడల్ R1, R2, మరియు R3 అనే మూడు వేరియంట్లలో, రూ.9.49 లక్షల ఎక్స్-షోరూం ప్రారంభ ధరతో అందించబడింది. ఇప్పుడు, లాంచ్ తర్వాత ఈ మోడల్ కి చెందిన ఎంట్రీ-లెవెల్ R1 వేరియంట్ దేశవ్యాప్తంగా ఉన్న డీలర్ షిప్స్ వద్దకు చేరుకోవడం ప్రారంభమైంది.
ఫీచర్ల పరంగా, ఆటోమేకర్ ఆల్ట్రోజ్ రేసర్ ఎంట్రీ-లెవెల్ వేరియంట్ లో ఎన్నో టెక్ ఫీచర్లను జతచేసింది. ఈ R1 వేరియంట్ 10.25-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, 4-ఇంచ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పుష్ స్టార్ట్/స్టాప్ బటన్, లెథరెట్ సీట్లు, ఎనిమిది స్పీకర్లు, వాషర్‌తో రియర్ వైపర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లతో వచ్చింది. అలాగే ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్స్, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్లు, ఆటో హెడ్‌ల్యాంప్స్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు మరియు మొత్తం నాలుగు పవర్ విండోల వంటి ఫీచర్లు కూడా అందించబడ్డాయి.
మొత్తానికి, టాప్-ఎండ్ వేరియంట్లతో పోలిస్తే బేస్-స్పెక్ R1 వేరియంట్ కొన్ని ఫీచర్లను మిస్ అయ్యిందనే చెప్పాలి. మిస్ అయిన ఫీచర్లలో పెద్ద డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఛార్జర్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 360-డిగ్రీ సరౌండ్ కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటర్, ఎయిర్ ప్యూరిఫైయర్ మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉన్నాయి.
మెకానికల్ గా, ఆల్ట్రోజ్ రేసర్ లోని అన్ని వేరియంట్లు 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్సుతో జతచేయబడిన 1.2-లీటర్ 3-సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ తో వచ్చాయి. ఇందులోని మోటార్ 118bhp మరియు 170Nm మాక్సిమం టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఈ కండీషన్లో, ఆల్ట్రోజ్ రేసర్ కారు కేవలం 11.3 సెకన్లలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్