- ఇండియాలో రూ. 6.60లక్షలతో ప్రారంభంకానున్నఆల్ట్రోజ్ ధరలు
- టాటా కార్లపై పరిమిత కాలపు డిస్కౌంట్స్
దేశవ్యాప్తంగా ఉన్న కొన్ని టాటా డీలర్‌షిప్స్ఈ నెలలో తమ మోడల్ రేంజ్ పై డిస్కౌంట్లను అందిస్తున్నారు. ఈ బెనిఫిట్స్ క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు కార్పొరేట్ డిస్కౌంట్స్ రూపంలో అందించబడతాయి.
టాటా ఆల్ట్రోజ్ విషయానికి వస్తే, బాలెనో మరియు గ్లాంజాలకు పోటీగా ఉన్న ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ పై రూ.20,000 వరకు క్యాష్ డిస్కౌంట్, అదే విధంగా రూ.10,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ. 5,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఆఫర్‌లు నెలాఖరు వరకు చెల్లుబాటులో ఉంటాయి.
టాటా మోటార్స్ ఇటీవల భారతదేశంలో ఆల్ట్రోజ్ రేసర్ వెర్షన్‌ను టెస్టింగ్ చేయడం ప్రారంభించింది. ఇది ఆటో ఎక్స్‌పో 2023లో మొదటిసారి ప్రదర్శించబడింది, ఈ వెర్షన్ 10.25-ఇంచ్ స్క్రీన్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు మరియు 6 ఎయిర్‌బ్యాగ్‌లు వంటి ఫీచర్స్ తో స్టాండర్డ్ ఆల్ట్రోజ్ అప్‌డేట్ చేయబడింది. ఆల్ట్రోజ్ రేసర్ రాబోయే నెలల్లో భారతదేశంలో లాంచ్ కావచ్చని భావిస్తున్నారు.
అనువాదించిన వారు: రాజపుష్ప