- 2027 నాటికి పదవ జనరేషన్ వస్తుందని అంచనా
- అతి చిన్న ఈవీగా మార్కెట్లోకి వచ్చే అవకాశం
పదవ జనరేషన్ మారుతి ఆల్టో కారు2027 నాటికి అందుబాటులోకి రానుంది మరియు ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న మోడల్ కంటే ఇది 100 కిలోల తక్కువ బరువుతో ఉండనుంది. కరెంట్ జనరేషన్ జపనీస్-స్పెక్ కారు పూర్తి బరువు 680 కేజీలు ఉంది. ఇప్పుడు ఇది కాస్త 100 కిలోల బరువు తగ్గనుండడంతో నెక్స్ట్ - జనరేషన్ బరువు 578 కేజీలకు చేరుకుంటుంది, ఈ బరువు 1970 సంవత్సరం ప్రారంభంలో వచ్చిన ఒరిజినల్ సుజులైట్‌కి చాలా దగ్గరగా ఉంటుంది. నిజం చెప్పాలంటే, ఈ బరువు 1983లో ఇండో-జపనీస్ ఆటోమేకర్ ఇన్నింగ్స్‌గా వచ్చిన SS80 మారుతి 800 కంటే మరింత తక్కువగా ఉండనుంది.
ఇప్పుడు సుజుకి కంపెనీకి ఆల్టో బరువును తగ్గించడం పెద్ద లక్ష్యం కాగా, చిన్న మరియు మరింత సమర్థవంతమైన ఇంజన్లను పరిచయం చేయడమేనని భావిస్తున్నాం. ఇలాంటి సమర్థవంతమైన ఇంజిన్ ని, లేటెస్టుగా కొత్త స్విఫ్ట్‌లో అందించిన Z12 ఇంజిన్ ద్వారా మనం చూడవచ్చు. మున్ముందు ఇలాంటి ఇంజిన్లు మరెన్నో రానున్నాయి. దీని ద్వారా ఇలాంటి ఇంజన్లను కొత్త డిజైర్, వ్యాగన్ ఆర్, బాలెనో మరియు ఫ్రాంక్స్ వంటి కార్లలో భవిష్యత్తులో మనం చూడవచ్చు.
సాధారణంగా చిన్న ఈవీలు మరియు హైబ్రిడ్ కార్లను తయారు చేసేటప్పుడు వీటి బరువు అధికం కాకుండా పెద్ద బ్యాటరీ ప్యాక్‌లను ఇన్‌స్టాల్ చేయడానికి ఆటోమేకర్‌ని కారు అనుమతిస్తుంది అని మేము విశ్వసిస్తున్నాం. ఇది పెద్ద ట్యాంక్‌లతో వచ్చే సిఎన్‍జిమోడల్స్ కి కూడా బెనిఫిట్ అందిస్తుందని భావిస్తున్నాం.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్