- 2023 చివరలో ప్రొడక్షన్ ప్రారంభం
- 500కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ ని అందించే అవకాశం
కొరియన్ ఆటోమేకర్ నుంచి ఇండియాలో చాలా పాపులర్ మోడల్ ఏదైనా ఉంది అంటే, ఏమాత్రం సందేహం లేకుండా అది హ్యుందాయ్ క్రెటా అని చెబుతాం. ఫేస్‍లిఫ్టెడ్ వెర్షన్ లాంచ్ తర్వాత మిడ్-సైజ్ ఎస్‍యూవీ హ్యుందాయ్ N లైన్ ఇటరేషన్ ని పరిచయం చేసింది. ఇప్పుడు, ఈ ఏడాది చివరి నాటికి క్రెటా ఎలక్ట్రిక్ వెర్షన్ ప్రొడక్షన్ లోకి వెళ్తుందని మనందరికీ తెలిసిన విషయమే. దాని కంటే ముందుగా, ఈ మోడల్ ప్రొడక్షన్-రెడీ షేప్ లో పలుమార్లు టెస్టింగ్ చేస్తూ కనిపించింది.
ఇక్కడ ఫోటోలో చూసిన విధంగా, క్రెటా ఈవీ ఫేస్‍లిఫ్టెడ్ క్రెటా ఎస్‍యూవీ ఆధారంగా వస్తుంది. ఇంతకు ముందున్న దాని లాగే ఒకే విధమైన కనెక్టింగ్ లైట్ బార్ తో ఎల్ఈడీ డీఆర్ఎల్స్, స్ప్లిట్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, రూఫ్-రెయిల్స్, మరియు ఇంటిగ్రేటెడ్ స్టాప్ ల్యాంప్ తో రియర్ స్పాయిలర్ వంటి వాటితో రానుంది. ఇంకా చెప్పాలంటే, ఈ క్రెటా ఈవీ దాని ఎలక్ట్రిక్ స్వభావానికి అనుగుణంగా ఏరో-డిజైన్డ్ అల్లాయ్ వీల్స్ ఫీచర్ తో రానుంది.
అలాగే ఇక్కడ కనిపిస్తున్న స్పై షాట్ లో ఇది ఫ్రంట్ కెమెరా ఇంటిగ్రేటెడ్ తో బ్లాంక్డ్-ఆఫ్ గ్రిల్ కనిపించింది. ఇంకా, బంపర్ పై ఎడాస్ (ఏడీఏఎస్) సెన్సార్ ఉండడంతో ఇందులో టెక్ ఫీచర్లను కూడా అందించే అవకాశం ఉంది. ఇంకా చెప్పాలంటే, ఫ్రంట్ ఫెండర్-మౌంటెడ్ ఛార్జింగ్ పోర్ట్ ఒక పెద్ద బ్లాక్ కవర్ తో కప్పబడి ఉండగా, ఇంతకు ముందు స్పై షాట్లలో కూడా క్రెటా ఈవీ ఇదే విధంగా కనిపించింది.
క్రెటా ఈవీ వెర్షన్ దాని ఐసీఈ వెర్షన్ కి పోటీగా ఫీచర్-రిచ్ గా కనిపించేందుకు ఎక్కువ ఫీచర్లతో వచ్చే అవకాశం ఉందని మేము భావిస్తున్నాం. ఇందులో అందించబడే ఫీచర్లలో ఇన్ఫోటైన్మెంట్ మరియు ఇంస్ట్రుమెంట్ ప్యానెల్ కోసం ట్విన్ డిస్ ప్లేలు, వెంటిలేటెడ్ మరియు పవర్డ్ ఫ్రంట్ సీట్స్, 360- డిగ్రీ సరౌండ్ కెమెరా, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్ రూఫ్, ఆటో-డిమ్మింగ్ ఐఆర్‍విఎం, రియర్ ఏసీ వెంట్స్ మరియు వైర్ లెస్ ఛార్జర్ వంటి ఉండే అవకాశం ఉంది.
ఇంకా బ్యాటరీ ప్యాక్ మరియు స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే, హ్యుందాయ్ క్రెటా ఈవీ కేవలం సింగిల్ ఛార్జ్ తో 500 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ అందించడానికి ఫ్లోర్-మౌంటెడ్ 50-60kWh బ్యాటరీ ప్యాక్ తో రావచ్చు. మొత్తానికి, ఇది వేరియంట్ ని బట్టి వివిధ బ్యాటరీ ప్యాక్స్ మరియు డ్రైవింగ్ రేంజ్ ఆప్షన్లతో వచ్చే అవకాశం ఉంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్