![హై-స్పీడ్ టెస్టింగ్ చేస్తూ కనిపించిన స్కోడా నుంచి రానున్న అతి చిన్న ఈవీ హై-స్పీడ్ టెస్టింగ్ చేస్తూ కనిపించిన స్కోడా నుంచి రానున్న అతి చిన్న ఈవీ](https://imgd.aeplcdn.com/642x361/n/cw/ec/180497/skoda-right-front-three-quarter0.jpeg?isig=0&q=80)
- వచ్చే సంవత్సరం ప్రొడక్షన్ టైపులో లాంచ్ అయ్యే అవకాశం
- భవిష్యత్తులో బడ్జెట్ స్కోడా మోడల్స్ రాబోతున్నట్లు క్లూని అందిస్తున్న ఈ అప్ డేట్
2023లో ఎల్రాక్ కాన్సెప్ట్ గా స్కోడా నుంచి అతి చిన్న ఈవీ ప్రదర్శించబడింది. ఇది ఇప్పుడు ఒక సర్క్యూట్ రేసులో ప్రొడక్షన్ టైపులో కనిపించింది. టెస్ట్ మ్యూల్ ఫోటోలను చూస్తే, ఈ ప్రోటోటైప్ కారు స్ప్లిట్ హెడ్ ల్యాంప్స్, ఫాక్స్ గ్రిల్, మరియు వర్టికల్ ఎయిర్ కర్టెయిన్స్ వంటి వాటిని కలిగి ఉంది.
ఓవరాల్ లుక్ చూస్తే, ఇక్కడ మనకు వీల్ ఆర్చెస్ మరియు షార్ప్ రేక్డ్ విండ్ స్క్రీన్ వంటివి కనిపిస్తాయి. ఫైనల్ గా, కారు వెనుక భాగంలోని ఫోటోలలో, ఇందులోని సిగ్నేచర్ స్కోడా టెయిల్ ల్యాంప్స్ మరియు లోగోల పొజిషన్ చూస్తే, ఎలాంటి సందేహం లేకుండా స్కోడా వెహికిల్ అని ఈజీగా గుర్తుపట్టేలా ఉన్నాయి.
![స్కోడా లెఫ్ట్ సైడ్ వ్యూ Skoda Left Side View](https://imgd.aeplcdn.com/0x0/statics/grey.gif)
మాకు అందించ స్పై రిపోర్ట్స్ ప్రకారం, ఇంటీరియర్లో డ్యూయల్ డిజిటల్ స్క్రీన్స్ మరియు ఓవరాల్ గా చిన్న చిన్న మార్పులతో క్యాబిన్ ఉండగా, ఇది అచ్చం గత సంవత్సరం ప్రదర్శించబడిన కాన్సెప్ట్ కారుగా అనిపిస్తుంది. అధికారికంగా, ఎల్రాక్ 4.5 మీటర్లు ఉంటున్నట్లుగా కంపెనీ వెల్లడించగా, ఓవరాల్ సైజ్ పరంగా ఇది కుషాక్ వలె ఉంటుంది.
మోడల్ ఎంఈడీ ప్లాట్ ఫారంపై వచ్చే అవకాశం ఉన్నట్లు భావిస్తుండగా, ఇందులోని చాలా వరకు ఫీచర్లు మరియు అంశాలు చాలా ఖరీదైన ఎలక్ట్రిక్ మోడల్స్ ఎన్యాక్ మరియు అప్ కమింగ్ (రాబోయే) సూపర్బ్ ఈవీ నుంచి తీసుకునే అవకాశం ఉంది. ఇది 62kWh బ్యాటరీ ప్యాక్ ని పొందే అవకాశం ఉండగా, అదే విధంగా 177bhp ఉత్పత్తి చేసే రియర్-మౌంటెడ్ మోటారుతో వచ్చే అవకాశం ఉంది.
![స్కోడా కుడి వెనుక మూడు వంతులు Skoda Right Rear Three Quarter](https://imgd.aeplcdn.com/0x0/statics/grey.gif)
కుషాక్ మరియు స్లావియాలతో పాటుగా, 2027 నాటికి ఇండియాలో స్కోడా నుండి ఇండియన్-స్పెసిఫిక్ ఈవీ రాబోతుందనే సూచనలు అందుతుండడంతో ఈ కారు మనకు చాలా ఆసక్తిని కలిగిస్తుంది. లాంచ్ తర్వాత, ఈ మోడల్ మారుతి eVX, టయోటా అర్బన్ స్పోర్ట్, హోండా ఎలివేట్ ఈవీ, హ్యుందాయ్ క్రెటా ఈవీ, కియా కారెన్స్ ఈవీ, మరియు మహీంద్రా మరియు టాటా నుంచి వచ్చే ఇతర ఈవీ మోడల్స్ తో పోటీ పడే అవకాశం ఉంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్