- 2025 ప్రథమార్థంలో లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న స్కోడా
- XUV 3XO, నెక్సాన్, బ్రెజా మరియు మరెన్నో కార్లకు పోటీగా ఉండనున్న కొత్త మోడల్
స్కోడా కంపెనీ ఇండియన్ మార్కెట్లో దాని కొత్త సబ్-ఫోర్-మీటర్ ఎస్‍యూవీని తీసుకురావడానికి ఈ సంవత్సరం ప్రారంభం నుంచి వ్యూహాలను రచిస్తుండగా, దాని ప్రణాళికలను ప్రకటించింది. ప్రస్తుతం పబ్లిక్ రోడ్లపై ఈ మోడల్ టెస్టింగ్ చేస్తుండగా, ఈ కారు పేరును ఫైనల్ చేయడానికి స్కోడా కంపెనీ ఆన్ లైన్ మరియు సోషల్ మీడియా ద్వారా ఒక పోటీని నిర్వహించింది, ఇప్పుడు దీని స్పై షాట్లు ఇంటర్నెట్లో దర్శనమిచ్చాయి.
స్పై షాట్‌లలో చూసినట్లుగా, స్కోడా నుండి వస్తున్న కొత్త సబ్-ఫోర్-మీటర్ ఎస్‍యూవీ భారీగా కామోఫ్లేజ్ తో కప్పబడి ఉంది. ఒక యూనిట్‌గా కనిపిస్తున్న ఈ ప్రొడక్షన్-రెడీ టెస్ట్ మ్యూల్ లో కనిపిస్తున్న సెలెక్ట్ అంశాలలో స్లీక్ స్వెప్‌బ్యాక్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ తో కూడిన స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ డిజైన్, స్క్వేర్డ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ క్లస్టర్, వైడ్ ఎయిర్ డ్యామ్ మరియు కొత్త ఎల్ఈడీ టెయిల్‌లైట్లు ఉన్నాయి.
మిగిలిన వాటిని కూడా పరిశీలిస్తే బ్లాక్ రూఫ్ రెయిల్స్, కొత్త ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్, బ్లాక్-అవుట్ స్టీల్ వీల్ కవర్లు, హై-మౌంటెడ్ స్టాప్ ల్యాంప్, టెయిల్‌గేట్-మౌంటెడ్ నంబర్ ప్లేట్ రిసెస్, ఎ-పిల్లర్ వెనుక ఉన్న ఓఆర్‍విఎం మరియు రియర్ డోర్స్ కోసం ఒక క్వార్టర్ గ్లాస్ వంటి వాటిని 2025 స్కోడా ఎస్‍యూవీ పొందనుంది.
సబ్-ఫోర్ మీటర్స్ పై ట్యాక్స్ బెనిఫిట్స్ ని పొందేందుకు, స్కోడా కంపెనీ దాని కొత్త ఎస్‍యూవీని 1.0-లీటర్, టిఎస్ఐ టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో మాత్రమే అందించే అవకాశం ఉంది, ఇది 114bhp మరియు 178Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో 6-స్పీడ్ మాన్యువల్ మరియు టార్క్ కన్వర్టర్ గేర్‌బాక్స్‌లు ఉండవచ్చు. లాంచ్ తర్వాత, ఈ కొత్త ఎస్‍యూవీ మోడల్ మారుతి బ్రెజా, మహీంద్రా XUV 3XO, టాటా నెక్సాన్, నిసాన్ మాగ్నైట్, కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ మరియు రెనాల్ట్ కైగర్‌లకు పోటీగా ఉండనుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్