అందుబాటులో ఉన్న3 కలర్ ఆప్షన్స్
1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో మాత్రమే అందించబడుతున్న మోడల్
స్కోడా ఇండియా స్లావియా 'స్టైల్ ఎడిషన్' అనే పేరుతో కొత్త లిమిటెడ్ ఎడిషన్‌ను ఇండియాలో ఈ రోజే లాంచ్ చేసింది. ఈ కొత్త స్పెషల్ ఎడిషన్ ని రూ. 19.13 లక్షలు (ఎక్స్-షోరూమ్)ధరతో, ఒకే పవర్‌ట్రెయిన్ ఆప్షన్ తో పొందవచ్చు. అంతే కాకుండా,ఇది చాలా కాస్మెటిక్ అప్డేట్లను పొందగా, మరియు స్లావియా స్టైల్ ఎడిషన్ యొక్క 500 యూనిట్లు మాత్రమే విక్రయించబడతాయి.
స్కోడా స్లావియా స్టైల్ ఎడిషన్ సెడాన్ యొక్క టాప్-స్పెక్ స్టైల్ వేరియంట్‌పై ఆధారపడి ఉండగా, దీని ధర రూ. 30,000 దీనితో సమానమైన వేరియంట్ కంటే ఎక్కువగా ఉండనుంది. ఈ కొత్త ఎడిషన్1.5-లీటర్ టర్బో-పెట్రోల్ మోటారుతో ఏడు-స్పీడ్ డిఎస్జి యూనిట్‌తో జతచేయబడుతుంది. అలాగే, దీనిని క్యాండీ వైట్, బ్రిలియంట్ సిల్వర్ మరియు టోర్నడో రెడ్ అనే 3 కలర్ ఆప్షన్ల నుండి కస్టమర్లు ఎంచుకోవచ్చు.
దీనిలో మార్పుల విషయానికొస్తే, స్లావియా యొక్క స్టైల్ ఎడిషన్ డ్యూయల్ డాష్ కెమెరా, స్కఫ్ ప్లేట్లు, ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, లోగో ప్రొజెక్షన్‌తో కూడిన పడిల్ ల్యాంప్స్ మరియు బి-పిల్లర్ మరియు స్టీరింగ్ వీల్‌పై స్లావియా బ్యాడ్జ్‌లను పొందింది. ఈస్టైల్ ఎడిషన్ ఎక్స్టీరియర్ భాగం బ్లాక్-అవుట్ రూఫ్, ఒఆర్విఎంఎస్ మరియు బి-పిల్లర్స్ ద్వారా హైలైట్ చేయబడింది.
అనువాదించిన వారు: రాజపుష్ప