- లిమిటెడ్ పీరియడ్ వరకు మాత్రమే అందుబాటులో ఉన్న తగ్గిన ధరలు
- మూడు వేరియంట్లలో స్లావియా మోడల్ లభ్యం
జూన్ నెలలో స్కోడా ఇండియా దాని ఎంక్యూబీ మోడల్స్ పై ధరలను సవరించగా, సవరించిన ధరలు కుషాక్ మరియు స్లావియాపై వర్తిస్తాయి. ఈ రెండు మోడల్స్ పై గణనీయంగా ధర తగ్గగా, కొత్త వేరియంట్లు కూడా జతచేయబడ్డాయి. దీంతో, స్లావియా సెడాన్ మోడల్ ఇప్పుడు రూ. 10.69 లక్షల ఎక్స్-షోరూం ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది.
కస్టమర్లు ఇప్పుడు స్కోడా స్లావియా కారును క్లాసిక్, సిగ్నేచర్, మరియు ప్రెస్టీజ్ అనే మూడు వేరియంట్లలో మాన్యువల్ మరియు ఆటోమేటిక్ వెర్షన్లలో సెలెక్ట్ చేసుకోవచ్చు. రూ.94,000 వరకు ధర తగ్గడంతో, ఇప్పుడు స్లావియా బేస్-స్పెక్ వేరియంట్ రూ. 10.69 లక్షల ఎక్స్-షోరూం ధరతో విక్రయించబడుతుండగా, టాప్-స్పెక్ ప్రెస్టీజ్ ఎటి వేరియంట్ రూ.18.69 లక్షల ఎక్స్-షోరూం ధరతో విక్రయించబడుతుంది.
ఆటోమేకర్ ఈ రెండు మోడళ్లను కస్టమర్లకు మరింత చేరువ చేసేందుకు దాని కొత్త స్ట్రాటజీని తీసుకువచ్చింది. అదేవిధంగా, ఆపరేషనల్ ఖర్చును సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా మరియు ఖర్చు తగ్గింపు బెనిఫిట్స్ ని కస్టమర్లకు అందించడం ద్వారా బ్రాండ్ దీనిని సాధించింది. అయితే ఈ ధరలు పరిమిత కాలానికి మాత్రమే తగ్గించబడ్డాయి.
స్కోడా స్లావియా మోడల్ లోని కొత్త వేరియంట్-వారీ ఎక్స్-షోరూం ధరలు క్రింది విధంగా ఉన్నాయి
వేరియంట్లు | 1.0-లీటర్ ఎంటి | 1.0-లీటర్ ఎటి | 1.5-లీటర్ ఎంటి | 1.5-లీటర్ ఎటి |
క్లాసిక్ | రూ. 10.69 లక్షలు | - | - | - |
సిగ్నేచర్ | రూ. 13.99 లక్షలు | రూ. 15.09 లక్షలు | రూ. 15.49 లక్షలు | రూ. 16.69 లక్షలు |
ప్రెస్టీజ్ | రూ. 15.99 లక్షలు | రూ. 17.09 లక్షలు | రూ. 17.49 లక్షలు | రూ. 18.69 లక్షలు |
అనువాదించిన వారు: సంజయ్ కుమార్