- ఈరోజు సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కానున్న స్లావియా మోంటే కార్లో బుకింగ్స్
- త్వరలో స్పోర్ట్‌లైన్ ఎడిషన్లను కూడా పరిచయం చేయనున్న స్కోడా
ఈరోజు (సెప్టెంబర్ 2, 2024) తర్వాత లాంచ్ కానున్న, స్కోడా స్లావియా మోంటే కార్లో ఎడిషన్ అప్పుడే లోకల్ డీలర్‌షిప్‌ల వద్దకు చేరుకోవడం ప్రారంభమైంది. ఈ సరికొత్తగా అందించబడుతున్న ఈ మోడల్ బుకింగ్ కోసం ఈరోజు సాయంత్రం 5 గంటల నుండి అందుబాటులో ఉంటుంది.
ఇక్కడ ఉన్న ఫోటోల ఆధారంగా చూస్తే, కొత్త స్లావియా మోంటే కార్లో ఎడిషన్ సిగ్నేచర్ రెడ్ షేడ్‌లో అందించబడుతుందన స్పష్టంగా తెలుస్తుంది. ఇంకా చెప్పాలంటే, ఇది గ్రిల్, బూట్‌లిడ్‌పై బ్యాడ్జింగ్, అల్లాయ్ వీల్స్ మరియు ఒఆర్విఎంఎస్ వంటి వివిధ అంశాలపై బ్లాక్-అవుట్ ఫినిషింగ్‌ను పొందింది. బూట్లిడ్-మౌంటెడ్ స్పాయిలర్, ఫెండర్‌పై మోంటే కార్లో బ్యాడ్జింగ్ మరియు డార్క్ కలర్లో టెయిల్‌లైట్స్ వంటివి కూడా పొందింది.
ఇంటీరియర్ పరంగా చూస్తే , 2024 స్కోడా స్లావియా మోంటే కార్లో ఆల్-బ్లాక్ థీమ్, డ్యాష్‌బోర్డ్‌లో రెడ్ ఇన్సస్ట్స్, మోంటే కార్లో-ఇన్‌స్క్రైబ్డ్ ఫ్రంట్ హెడ్‌రెస్ట్స్, మోంటే కార్లో స్కఫ్ ప్లేట్స్ మరియు డ్యూయల్-టోన్ రెడ్ మరియు బ్లాక్ సీట్లతో వస్తుంది. ఫీచర్స్ వివరాలు చూస్తే, ఇది వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 10-ఇంచ్ టచ్‌స్క్రీన్ యూనిట్ మరియు 8-ఇంచ్ పూర్తి డిజిటల్ వర్చువల్ కాక్‌పిట్‌ను పొందుతుంది.
స్కోడా స్లావియాను 1.0-లీటర్ మరియు 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్లతో అందిస్తున్నప్పటికీ, మోంటే కార్లో వేరియంట్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో మాత్రమే రెండోది అందుబాటులో ఉంటుందని మేము భావిస్తున్నాము. ఈ మోటార్ 148bhp మరియు 250Nm టార్కును ఉత్పత్తి చేస్తుండగా, మరియు 6-స్పీడ్ మాన్యువల్ మరియు 7-స్పీడ్ డిఎస్జి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో అందించబడుతుంది. స్లావియా మోంటే కార్లో కాకుండా, చెక్ బ్రాండ్ కుషాక్ మరియు స్లావియా స్పోర్ట్‌లైన్ వెర్షన్లను కూడా పరిచయం చేయనుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప