- స్పెషల్ ఎడిషన్ గా వచ్చిన మోంటే కార్లో
- కాస్మెటిక్ మార్పులు మరియు కొత్త ఫీచర్లను కలిగి ఉన్న మోడల్
స్కోడా ఇటీవలే ఇండియాలో స్లావియా మోంటే కార్లో ఎడిషన్‌ను లాంచ్ చేయగా, రూ.15.79 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధర తో ప్రారంభమయ్యాయి. అలాగే, మేము ఇంతకు ముందు చూసిన వాటిలో మార్పులను పరిశీలిస్తే మోంటే కార్లో ఎడిషన్ కారు కాస్మెటిక్ మార్పులు మరియు కొత్త ఫీచర్లను పొందింది. ఈ అప్‌డేట్‌లన్నింటినీ హైలైట్ చేసే చిత్రాలు అన్ని ఇక్కడ ఉన్నాయి.
స్కోడా స్లావియా మోంటే కార్లో ఇమేజ్ గ్యాలరీ
స్లావియా మోంటే కార్లో ఎడిషన్ టోర్నడో రెడ్ మరియు క్యాండీ వైట్ అనే రెండు కలర్ ఆప్షన్‌లలో అందించబడుతుంది. ఇది డీప్ బ్లాక్ రూఫ్ పై డ్యూయల్-టోన్ థీమ్‌ను కలిగి ఉంది.
ఈ స్పెషల్ ఎడిషన్‌లో బ్లాక్-అవుట్ ఫ్రంట్ గ్రిల్, ఒఆర్‍విఎంఎస్, ఫ్రంట్ స్పాయిలర్, సైడ్ స్కర్ట్స్ మరియు బూట్ స్పాయిలర్ ఉన్నాయి. ఇది బ్లాక్ కలర్ 16-ఇంచ్ అల్లాయ్ వీల్స్‌పై రైడ్ చేస్తుంది.
ఇతర హైలైట్స్ లో, ఫాగ్ ల్యాంప్స్ మరియు విండోస్ చుట్టూ బ్లాక్ కలర్ ను పొందగా, డోర్ హ్యాండిల్స్‌పై డార్క్ క్రోమ్ యాక్సెంట్స్, స్మోక్డ్ ఎల్ఈడీ టెయిల్‌లైట్స్, బ్లాక్ బంపర్ గార్నిష్ మరియు డార్క్ బ్యాడ్జిస్ వంటివి ఉన్నాయి.
లోపలి భాగంలో, స్లావియా మోంటే కార్లో బ్లాక్ మరియు రెడ్ -థీమ్ ఇంటీరియర్ ని కలిగి ఉంది. డిజైన్ మరియు లేఅవుట్ ఒకేలా ఉన్నప్పటికీ ఇది స్టాండర్డ్ వెర్షన్ నుండి కొత్తగా ఉంది.
ఇది రెడ్ ఇన్‌సర్ట్‌లతో బ్లాక్ డ్యాష్‌బోర్డ్, రెడ్ కలర్లో రెండు-టోన్ సీట్ అప్హోల్స్టరీ మరియు హెడ్‌రెస్ట్‌లపై ‘మోంటే కార్లో’ ఎంబ్రాయిడరీతో బ్లాక్ మరియు మోంటే కార్లో స్కఫ్ ప్లేట్‌లను కలిగి ఉంది.
అంతేకాకుండా, ఇది ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల ఫ్రంట్ సీట్స్ మరియు అల్యూమినియం పెడల్స్‌ను పొందింది. అలాగే, 10-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు 8-ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ రెడ్ కలర్ థీమ్‌ను పొందింది.
పవర్‌ట్రెయిన్
స్లావియా మోంటే కార్లో 1.0-లీటర్ మరియు 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ అనే రెండు ఇంజన్‌లతో అందుబాటులో ఉంది. మొదటిది 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్‌తో అందించబడగా, రెండోది 7-స్పీడ్ డిఎస్‍జి గేర్ బాక్సుతో అందించబడింది.
అనువాదించిన వారు: రాజపుష్ప